Animal: ‘యానిమల్‌’ రన్‌ టైమ్‌ ఇదే..! ఇటీవల కాలంలో ఇదే అతి పెద్ద సినిమా!

‘యానిమల్‌’ (Animal) సినిమా రన్‌టైమ్‌ను దర్శకుడు సందీప్‌ వంగా వెల్లడించారు. అంతేకాదు, సినిమాకు ‘ఏ’ సర్టిఫికెట్‌ ఇచ్చినట్లు తెలిపారు.

Updated : 22 Nov 2023 18:36 IST

ఇంటర్నెట్‌డెస్క్: రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) - రష్మిక (Rashmika) జంటగా నటించిన చిత్రం ‘యానిమల్‌’ (Animal). సందీప్‌రెడ్డి వంగా దర్శకుడు. విభిన్న కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ‘యానిమల్‌’కు సంబంధించిన రన్‌టైమ్‌ను దర్శకుడు సందీప్‌ వంగా పంచుకున్నారు. ఈ సినిమా నిడివి చూసి, నెటిజన్లే కాదు, సినీ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ‘‘యానిమల్‌’ నిడివి 3 గంటలా 21 నిమిషాలా 23 సెకన్లు & 16 ఫ్రేమ్స్‌’’ అంటూ సందీప్‌ తెలిపారు. ఇటీవల కాలంలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక నిడివి ఉన్న బాలీవుడ్‌ చిత్రం ఇదే కానుంది. 2016లో విడుదలైన ‘ధోనీ’ తర్వాత 3 గంటలకు పైగా నిడివి ఉన్న హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. ‘ధోనీ’ రన్‌టైన్‌ 3.10 గంటలు. ప్రస్తుతం మూడు గంటల సినిమా అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ, సందీప్‌ వంగా తన కథపై నమ్మకంతో ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఆయన తీసిన ‘అర్జున్‌ రెడ్డి’ కూడా మూడు గంటల సినిమాయే. అయితే, అదే సినిమాను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ పేరుతో కాస్త నిడివి తగ్గించి తీశారు. మళ్లీ ఇప్పుడు ‘యానిమల్‌’ కోసం మరో డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నారు.

Paruchuri: ఆ జాగ్రత్త తీసుకుని ఉంటే ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’కి మంచి లాభాలొచ్చేవి

‘కబీర్‌ సింగ్‌’ తర్వాత బాలీవుడ్‌లో సందీప్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిదే. డిసెంబర్‌ 1న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది. అనిల్‌ కపూర్‌, బాబీ డియోల్‌, శక్తికపూర్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే.. మునుపెన్నడూ చూడని విధంగా ఇందులో రణ్‌బీర్‌ పాత్ర ఉండనుందని తెలుస్తోంది. మరోవైపు, సినిమా రిలీజ్‌ దగ్గరవుతోన్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌ వేగవంతం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని