Animal: ‘యానిమల్‌’ సక్సెస్‌ మీట్‌.. ఫొటోలు వైరల్‌

ముంబయిలో ‘యానిమల్‌’(Animal) సక్సెస్‌ మీట్‌ జరిగింది. పలువురు తారాలు హాజరయ్యారు.

Published : 07 Jan 2024 13:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సందీప్‌ వంగా-రణ్‌బీర్‌ కపూర్‌ కాంబోలో వచ్చిన ‘యానిమల్‌’ సక్సెస్‌ మీట్‌ను ముంబయిలో నిర్వహించారు. చిత్ర బృందంతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వేడుకలో తమన్నా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి.

‘సందీప్‌ వంగా సినిమాలో నటించడం మా అందరి అదృష్టం. అతడికి సెల్యూట్‌ చేయాలనుంది. ఓ వర్గం ప్రేక్షకులు వ్యతిరేకించినా.. ఇది ఘన విజయాన్ని సొంతం చేసుకుంది’ అని రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) ఆనందం వ్యక్తం చేశారు. ఇంతమంది ప్రేమాభిమానాలు పొందినందుకు సంతోషంగా ఉందంటూ దర్శకుడికి త్రిప్తి డిమ్రీ కృతజ్ఞతలు చెప్పారు.

.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని