BalaKrishna: ప్రతికూల వాతావరణంతో బాలకృష్ణ హెలికాప్టర్‌ వెనక్కి..

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ శుక్రవారం రాత్రి ఒంగోలులో నిర్వహించారు. రాత్రి అక్కడే బస చేసిన బాలకృష్ణ ఇవాళ హైదరాబాద్‌ బయలుదేరారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో హెలికాప్టర్‌ను అత్యవసరంగా వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.

Updated : 07 Jan 2023 12:35 IST

ఒంగోలు: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం రాత్రి ఒంగోలులో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈవెంట్‌ అనంతరం బాలకృష్ణ ఒంగోలులోనే బస చేశారు. ఇవాళ ఉదయం హెలికాప్టర్‌లో బాలయ్య హైదరాబాద్‌ బయలుదేరారు. అయితే, వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 5 నిమిషాల్లోనే హెలికాప్టర్‌ వెనక్కి మళ్లింది. హెలికాప్టర్‌లో బాలకృష్ణతో పాటు ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ కూడా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని