Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్మాన్‌ చిత్రంలో ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’

సల్మాన్‌ ఖాన్‌ చిత్రంలో బతుకమ్మ పాట అలరిస్తోంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’. తాజాగా ఈ సినిమాలోని ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు.

Updated : 01 Apr 2023 07:05 IST

సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) చిత్రంలో బతుకమ్మ పాట అలరిస్తోంది. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). తాజాగా ఈ సినిమాలోని ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో..’ అనే పాటను శుక్రవారం విడుదల చేశారు. ఆధునిక సంగీతంలో తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను మేళవిస్తూ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇందులో సంప్రదాయ వస్త్రాధారణలో పూజ, సల్మాన్‌ కనువిందు చేశారు. ఫర్హాద్‌ సామ్‌జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రాంతీయ సంస్కృతిపై ప్రేమని ప్రదర్శిస్తూ...  కథానాయకుడు వెంకటేష్‌ సూచనతో సల్మాన్‌ఖాన్‌ ఎంతో ఇష్టపడి ఈ పాట చేశారని సినీ వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా విడుదల చేసిన బతుకమ్మ పాటలో సల్మాన్‌ఖాన్‌తోపాటు,  వెంకటేష్‌, పూజాహెగ్డే, భూమిక తదితరుల సందడి ఆకట్టుకుంది. 200 మంది నృత్యకారులపై ఈ పాటని తెరకెక్కించినట్టు సినీ వర్గాలు తెలిపాయి.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని