Brahmaji: లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌నంటూ మోసం.. బ్రహ్మాజీ ట్వీట్‌

సినీ పరిశ్రమలోకి రావాలనుకునే కొత్తతరం నటీనటులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతోన్న సరికొత్త స్కామ్‌ గురించి నటుడు బ్రహ్మాజీ (Brahmaji) ట్వీట్‌ చేశారు. జాగ్రత్తగా ఉండాలని ఆయన కొత్త వారికి సూచించారు.

Updated : 05 Oct 2023 13:39 IST

హైదరాబాద్‌: యువ నటీనటులను టార్గెట్‌ చేసుకుని జరుగుతోన్న కొత్తరకం స్కామ్‌పై నటుడు బ్రహ్మాజీ (Brahmaji) తాజాగా ట్వీట్లు చేశారు. తాము స్టార్‌ దర్శకుల వద్ద పనిచేస్తున్నామంటూ పలువురు వ్యక్తులు.. యువ నటులకు సందేశాలు పంపిస్తున్నారని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా డబ్బులు కూడా వసూలు చేస్తున్నారన్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.

ఈ వారం ఓటీటీలో 20కుపైగా చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు..!

‘‘నటరాజ్‌ అన్నాదొరై అనే వ్యక్తి.. తాను దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ మేనేజర్‌నని చెబుతూ పలువురు యువతీ యువకులకు మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్‌ చేస్తున్నాడు. లోకేశ్‌ తెరకెక్కించే తదుపరి చిత్రానికి వారి ప్రొఫైల్‌ ఎంపికైందని.. డబ్బులిస్తే ఆడిషన్‌కు అవసరమైన కాస్ట్యూమ్స్‌ తాను రెంట్‌కు తీసుకువస్తానని.. ఆడిషన్‌ పూర్తయ్యాక ఆ డబ్బులు వాపస్‌ ఇచ్చేస్తానని అతడు నమ్మబలుకుతున్నాడు. అలాగే సత్యదేవ్‌ అనే మరో వ్యక్తి తాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ జర్నలిస్ట్‌నని చెబుతూ డబ్బులు గుంజడానికి ప్రయత్నిస్తున్నాడు. సినీ పరిశ్రమలోకి రావాలని కలలుకనే కొత్తతరం నటులను టార్గెట్‌గా చేసుకుని వీళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి’’ అని బ్రహ్మాజీ ట్వీట్లు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని