Extra Ordinary Man: బ్రష్‌ వేసుకో.. మైండ్‌ రీఫ్రెష్‌ చేసుకో!

‘ఎక్స్‌ ట్రా - ఆర్డినరీ మేన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఆయన.. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ తెరకెక్కించారు.

Updated : 11 Nov 2023 15:20 IST

‘ఎక్స్‌ ట్రా - ఆర్డినరీ మేన్‌’గా ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఆయన.. శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రాన్ని వక్కంతం వంశీ తెరకెక్కించారు. సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 8న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రం నుంచి ‘‘హేయ్‌ మామా బ్రష్‌ వేసుకో.. మైండ్‌ అంతా రీఫ్రెష్‌ చేసుకో’’ అనే గీతాన్ని విడుదల చేశారు. హారిస్‌ జయరాజ్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించగా.. సంజిత్‌ హెగ్డే ఆలపించారు. ‘‘ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. నితిన్‌ ఇందులో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా పలు భిన్నమైన గెటప్పుల్లో సందడి చేయనున్నారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని