Chiranjeevi: శుభం కార్డు పడినట్లే.. ఈ నెలాఖరుకు జీవో వస్తుందని భావిస్తున్నాం: చిరంజీవి
సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు.
అమరావతి: సీఎం జగన్ నిర్ణయం తమను ఎంతో సంతోష పరిచిందని ప్రముఖ సినీ నటుడు చిరంజీవి అన్నారు. టికెట్ ధరలకు సంబంధించి శుభం కార్డు పడినట్లు తాము భావిస్తున్నామని చెప్పారు. చిన్న సినిమాల ఐదోషోకు అనుమతించడం శుభపరిణామమని చెప్పారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ అనంతరం సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడారు.
సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, మా ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. అటు సామాన్య ప్రజలకు, ఇటు ఇండస్ట్రీ వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గతంలో నేను చర్చించిన అంశాల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం మట్లాడారు. అందరికీ లాభదాయకంగా ఉండేలా ఆయన తీసుకున్న నిర్ణయం సంతోషపరిచింది. పరిశ్రమ చక్కగా ఉండాలంటే చిన్న సినిమా నిర్మాతలు, దర్శకులు బాగుండాలి. ఈ ఉద్దేశంతో ఐదో షోకు మేము అనుమతి కోరగా.. సీఎం ఆమోదం చెప్పారు. ఈ రోజు దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలకు గొప్ప కీర్తి లభిస్తోంది. అందుకు కారణమైన భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రత్యేకించి వెసులుబాటు కోరగా.. దానిపై మరోసారి కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. తెలంగాణలో చిత్రపరిశ్రమ అభివృద్ధి చెందిన విధంగా ఏపీలోనూ సినిమా వృద్ధి చెందాలని ముఖ్యమంత్రి అన్నారు. అందుకు కావాల్సిన ప్రోత్సహాన్ని అందిస్తానని కూడా చెప్పారు. వైజాగ్‌ని సినిమా షూటింగ్స్‌కు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. అందుకు మేము సైతం మా వంతు సహకారం అందిస్తామని చెప్పాం. ఈ చర్చల విషయంలో ముందు నుంచి మాకు ఎంతో మద్దతుగా నిలిచిన మంత్రి పేర్ని నానికి ధన్యవాదాలు. నాని చొరవ వలనే ఈ సమస్యకు త్వరితగతిన శుభం కార్డు పడిందనుకుంటున్నా. ఇకపై ఎలాంటి సమస్య వచ్చినా చర్చలతో సామరస్యంగా పరిష్కరించుకుంటాం. ఈ నెల మూడో వారంలోపు సినీ పరిశ్రమకు సంబంధించిన జీవో వచ్చే అవకాశం ఉంది
- చిరంజీవి
సినీ పరిశ్రమ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, చర్చలు నిర్వహించేలా చొరవ తీసుకున్నందుకు చిరంజీవికి ధన్యవాదాలు. గత ఆరు నెలల నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ అయోమయ వాతావరణంలో ఉంది. ఈ రోజుతో పెద్ద రిలీఫ్ వచ్చింది. పేర్ని నాని, సీఎం జగన్‌కు ధన్యవాదాలు. వారం, పది రోజుల్లో గుడ్ న్యూస్ వింటాం
- మహేశ్‌బాబు
సినిమా పరిశ్రమకు సంబంధించిన అన్ని విషయాలపై జగన్‌కు ఉన్న చొరవ చూసి ఆనందం కలిగింది. మా ప్రతిపాదనలన్నీ విని మంచి నిర్ణయాన్ని తీసుకున్నందుకు ఆయనకు ధన్యవాదాలు. అలాగే చిరంజీవికి ధన్యవాదాలు. సినిమా పెద్ద అంటే ఆయనకు నచ్చదు కానీ, చేసే పనుల వల్ల ఆయన పెద్దరికం తెలుస్తోంది. సీఎంతో తనకున్న సాన్నిహిత్యంతో చిరు ఈ చర్చలు జరిపి.. సినీ పరిశ్రమ వృద్ధి కోసం శ్రమించారు
- రాజమౌళి
తెలుగు రాష్ట్రాల్లో సగటు సినిమా మనుగడ కష్టంగా మారింది. భారీ సినిమాలు రిలీజైనప్పుడు చిన్న సినిమాల రిలీజ్‌కు థియేటర్లు ఉండటం లేదు. అలాంటి సగటు చిత్రాన్ని కాపాడాలనే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ మొత్తం చర్చల్లో చిరంజీవి పెద్ద పాత్ర పోషించారు. మీకున్న సాన్నిహిత్యంతో సీఎంకు ఇండస్ట్రీ సమస్యలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. అదే మాదిరిగా.. నంది అవార్డులు సైతం అందజేసే విధంగా రెండు తెలుగు రాష్ట్రాలతో మాట్లాడాలని కోరుకుంటున్నా
- ఆర్. నారాయణ మూర్తి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు లేటెస్ట్ అప్డేట్స్తో వచ్చేశారు. ఆదివారం ఏయే పిక్స్‌తో అలరించారో మీరూ చూసేయండి -
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ‘కర్మ’ గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. -
రోజా కామెంట్స్‌పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
తనపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలపై గెటప్ శ్రీను స్పందించారు. -
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
తన శిష్యుడు, దర్శకుడు అర్జున్‌పై సుకుమార్ ప్రశంసలు కురిపించారు. -
మృణాల్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్‌కు 1400 గంటలు
హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అవుట్‌ఫిట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజు పేరు వెనుక ఉన్న స్టోరీ మీకు తెలుసా? -
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..