సాగుతూనే ఉండు.. లవ్యూ తమ్ముడు

లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమతమైన సినిమా ప్రముఖులు ఇప్పుడిప్పుడే శరీరాలకు చెమటపట్టిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి కదా.. ప్రేక్షకులను మెప్పించాలంటే తప్పదు మరి. అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. ఫొటోలు పంచుకొని అభిమానులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Published : 04 Dec 2020 01:35 IST

సోషల్‌ లుక్‌: సినీ ప్రముఖులు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమతమైన సినిమా ప్రముఖులు ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్నారు. కసరత్తులతో శరీరానికి చెమటపట్టిస్తున్నారు. సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి కదా.. ప్రేక్షకులను మెప్పించాలంటే ఆ మాత్రం కష్టపడక తప్పదు మరి..! అందుకే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారు. మరి కొంతమంది తమ కుటుంబం, సన్నిహితులతో కలిసిన మధురక్షణాలను సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇంకా.. ఎవరెవరు ఏం పోస్టు చేశారో చూసేయండి మరి...

* నటి, నిర్మాత ఛార్మికౌర్‌ వ్యాయామం చేస్తున్న ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుందని అందులో పేర్కొన్నారు.

* ప్రముఖ యాంకర్‌ అనసూయ.. బాండింగ్‌ విత్‌ బ్రిలియంట్‌ అంటూ నటుడు విజయ్‌  సేతుపతితో దిగిన ఫొటోను పోస్టు చేశారు.

* పూరీ మ్యూజింగ్స్‌ ఇలాగే చేస్తారు.. అంటూ గేయ రచయిత భాస్కరభట్ల ఓ ఫొటో పోస్టు చేశారు. తమ్ముడూ లవ్యూ అంటూ పూరీ దాన్ని రీట్వీట్‌ చేశారు.

* ‘రంగ్‌దే’ సెట్లో హీరో నితిన్‌తో డ్యాన్స్‌ మ్యాస్టర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఒక ఫొటో దిగి దాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

* బాలీవుడ్‌ కండల హీరో టైగర్‌ ష్రాఫ్‌ ఒక ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

* గాయకుడు ఉదిత్‌ నారాయణ కుమారుడు ఆదిత్య నారాయణ.. తన వివాహ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

* హీరోయిన్‌ వేదిక సముద్రంలో ఆడిపాడుతున్నప్పటి చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు.

















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని