Waltair Veerayya: చిరు-రవితేజ.. ఓ మాస్‌ పాట

కథానాయకులు చిరంజీవి, రవితేజ ‘వాల్తేరు వీరయ్య’ కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో ఓ మాస్‌ గీతానికి స్టెప్పులేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక.

Updated : 29 Oct 2022 08:48 IST

థానాయకులు చిరంజీవి (Chiranjeevi), రవితేజ (Raviteja) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) కోసం చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఈ సినిమాలో ఓ మాస్‌ గీతానికి స్టెప్పులేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కిస్తున్న మాస్‌ యాక్షన్‌ చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్రీకరణను శరవేగంగా పూర్తి చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగానే తాజాగా చిరు, రవితేజలపై ఓ మాస్‌ పాటను చిత్రీకరించారు. ఈ గీతానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలందించగా.. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ పాటకు చిరంజీవి, రవితేజ వేసిన చక్కటి మాస్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటాయని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి కూర్పు: నిరంజన్‌ దేవరమానే, ఛాయాగ్రహణం: ఆర్థర్‌ ఎ విల్సన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని