Pushpa The Rule: అది మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌.. ‘పుష్ప-2’పై దేవిశ్రీ కీలక వ్యాఖ్యలు

‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule)ను ఉద్దేశిస్తూ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదొక అత్యద్భుతమైన స్క్రిప్ట్‌ అన్నారు.

Updated : 09 Sep 2023 15:49 IST

చెన్నై: అల్లు అర్జున్‌ (Allu Arjun) నటిస్తోన్న ‘పుష్ప- ది రూల్‌’ (Pushpa The Rule) కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ తమకు ఈసారి ఎలాంటి ట్రీట్‌ ఇవ్వనున్నారా అని బన్నీ అభిమానులు ఆశగా వేచి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ‘పుష్ప 2’ (Pushpa 2)పై అంచనాలు పెంచేలా చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ (Devi Sri Prasad) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి సినిమా మరో స్థాయిలో ఉండనుందని అన్నారు.

‘‘ఈ సినిమా కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ సినిమాకు సంబంధించిన విషయాలను నేను ఇప్పుడే ఎక్కువగా చెప్పలేను. కానీ, ఒక విషయాన్ని మాత్రం చెప్పగలను. ఎవరూ ఊహించని విధంగా సుకుమార్‌ దీన్ని క్రియేట్‌ చేస్తున్నారు. ఇదొక మైండ్‌ బ్లోయింగ్‌ స్క్రిప్ట్‌. ఒక సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ నేను చూశా. ఆ సీక్వెన్స్‌ గురించి ఎక్కువగా చెప్పను. కాకపోతే అది మాత్రం మైండ్‌ బ్లోయింగ్‌ సీక్వెన్స్‌’’ అని దేవిశ్రీ ప్రసాద్‌ తెలిపారు. సినిమాని ఉద్దేశిస్తూ దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

అభిషేక్‌ పిక్చర్స్‌ ఎంతోకాలం నుంచి ఇబ్బంది పెడుతోంది: డిస్ట్రిబ్యూటర్‌ ఆరోపణలపై విజయ్‌ తండ్రి ఆగ్రహం

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఊరమాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కింది. సుకుమార్‌ దర్శకుడు. రష్మిక (Rashmika) కథానాయిక. 2021లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబట్టింది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ పోషించిన పాత్రకు అంతటా విశేష ఆదరణ లభించింది. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపికైన విషయం తెలిసిందే. ‘పుష్ప ది రైజ్‌’కు సీక్వెల్‌గా ఇప్పుడు ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతోంది. పార్ట్‌ 1కు వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని పార్ట్‌2ను మరింత గ్రాండ్‌గా సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా సెట్‌కు సంబంధించిన ఓ ఫొటోను ఇటీవల రష్మిక షేర్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని