Ghani: అందుకే వరుణ్‌తేజ్‌ను బాక్సర్‌గా మార్చా: కిరణ్ కొర్రపాటి
‘‘వరుణ్‌తేజ్ కటౌట్‌కు బాక్సింగ్ బాగుంటుంది. అందుకే ఆ నేపథ్యంలోనే చిత్రం తెరకెక్కించా’’ అని కిరణ్ కొర్రపాటి అన్నారు. ‘గని’ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ‘‘వరుణ్‌తేజ్ కటౌట్‌కు బాక్సింగ్ బాగుంటుంది. ఆ నేపథ్యంలోనే చిత్రం తెరకెక్కించా’’ అని కిరణ్ కొర్రపాటి అన్నారు. ‘గని’ సినిమాతో ఆయన దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
* నేను చెన్నైలో ఉన్నప్పుడు ప్రతి సినిమా ప్రీమియర్ షో చూసేవాడ్ని. అలా సినిమా రంగంపై ఆసక్తి పెరిగింది. హైదరాబాద్ వచ్చాకే దర్శకత్వం చేయాలనుకున్నా. ముందుగా దర్శకుడు వి.వి. వినాయక్ ఆ తర్వాత శ్రీనువైట్ల, హరీశ్ శంకర్, రాఘవ లారెన్స్ తదితరుల దగ్గర పనిచేశా.
* ఈ సినిమాకు ముందే వరుణ్‌తేజ్‌తో నాకు పరిచయం ఉంది. ఎప్పటి నుంచో ఆయన నాతో సినిమా చేయాలనుకున్నారు. ఈ క్రమంలో రెండు మూడు కథల గురించి చర్చించుకున్నాం. స్పోర్ట్స్ డ్రామాను ఫిక్స్ చేశాం. ఇతర క్రీడా నేపథ్య చిత్రాల్లో కథకు ప్రాధాన్యముంటుంది కానీ శారీరకంగా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే అవకాశం అంతగా ఉండదు. అందుకే వరుణ్ కటౌట్‌కు బాక్సింగ్ బెటర్ అనుకుని స్క్రిప్టు సిద్ధం చేశా.
* ప్రతి స్పోర్ట్స్ డ్రామాలోనూ జీరో నుంచి హీరో స్థాయికి ఎదిగే స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఉన్నట్టే ఇందులోనూ ఉంటుంది. ఈ సినిమాకు ‘ఫైటర్’, ‘ఛాంపియన్’వంటి టైటిళ్లు అనుకున్నాం కానీ కుదరలేదు. కథానాయకుడి పాత్రకు తగ్గట్టు పవర్‌ఫుల్‌గా ఉండే రెండక్షరాల పేరు అయితే బాగుంటుందనుకున్నాం. అదే సమయానికి వరుణ్ నటించిన ‘గద్దలకొండ గణేశ్’ సినిమా విడుదలైంది. అందులోని గణేశ్ అలియస్ గని పాత్ర పాపులరైంది. ఆ పేరు పెడితే ఎలా ఉంటుందని వరుణ్ అడగ్గానే వెంటనే ఓకే చేశా. పవన్ కల్యాణ్ నటించిన ‘బాలు’ సినిమాలోని గని పాత్రకూ ప్రత్యేక అభిమానగణం ఉంది.
* ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఉపేంద్రగారిని సుమారు 6 నెలలు సంప్రదించాం. ‘నేను ఎలాంటి సినిమాలు చేయట్లేదమ్మా’ అని సమాధానమిచ్చేవారు. ఓ సారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ను కలిశా. 5 నిమిషాల సమయం ఇచ్చారు కానీ కథలో లీనమవడంతో గంట గడిచింది. పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడలో ఒకే రోజు విడుదల చేస్తున్నాం. ‘బీస్ట్’, ‘కేజీయఫ్ ఛాప్టర్ 2’ సినిమాల దృష్ట్యా తమిళం, కన్నడలో రెండు వారాల తర్వాత రిలీజ్ చేయనున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే? -
శరవేగంగా ‘కన్నప్ప’.. ఆ పాత్ర షూటింగ్ పూర్తి
మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ‘కన్నప్ప’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. -
ఇప్పటి వరకు 32మంది దర్శకులతో వర్క్ చేశా: అల్లరి నరేశ్
‘ఆ ఒక్కటీ అడక్కు’ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. అడివి శేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
‘హరిహర వీరమల్లు’ మిగిలిన షూటింగ్‌ను క్రిష్ స్థానంలో మరొకరు వర్క్ చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. -
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఎస్ఎస్ఎంబీ 29’ గురించి పలు విశేషాలు పంచుకున్నారు నిర్మాత కె.ఎల్. నారాయణ. బడ్జెట్ గురించి ఏమన్నారంటే? -
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
‘కృష్ణమ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. -
కీర్తి సురేశ్‌తో ‘ఉప్పు కప్పురంబు’.. సుహాస్ రియాక్షన్ ఏంటంటే?
కీర్తి సురేశ్‌తో కలిసి నటించనున్న ‘ఉప్పు కప్పురంబు’ సినిమా గురించి సుహాస్ ఏమన్నారంటే? -
‘సలార్-2’కు అంతా సిద్ధం.. షూటింగ్ ఎప్పుడంటే?
Prabhas: ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా? అని ఎదురుచూస్తున్న ‘సలార్-2’ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. -
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్‌పై లారా దత్తా కామెంట్స్
‘రామాయణ’లో తాను నటిస్తున్నట్లు వస్తోన్న రూమర్స్‌పై బాలీవుడ్ నటి లారా దత్తా స్పందించారు. -
స్టార్లు లేకపోయినా ‘మే’మున్నామంటూ.. ఈ నెలలో సందడి చేసే చిత్రాలివే!
మే నెలలో ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఏ రోజు ఏ చిత్రం విడుదల కానుందంటే? -
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
‘బాహుబలి’ గురించి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. -
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ మూవీ ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ వస్తున్న వార్తలపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. -
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
గత నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు విడుదలవుతున్నా, పెద్దగా మెప్పించినవి ఏవీ లేవు. మే మొదటి వారంలో పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరి అటు థియేటర్, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో చూసేయండి -
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు: తమన్నా
ఇండస్ట్రీలో ఇలాంటి వ్యక్తిని చూడలేదంటూ ఓ హీరోయిన్ని ప్రశంసించారు తమన్నా. ఆమె ఎవరంటే? -
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
ప్రముఖ హీరోయిన్ సమంత తన కొత్త సినిమాని ప్రకటించారు. -
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
ప్రభాస్ ‘కల్కి’ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. కొత్త విడుదల తేదీని ప్రకటించింది. -
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్
ఇటీవలే షూటింగ్ మొదలైన ‘రామాయణ’ మూవీకి సంబంధించి సెట్స్‌లో ఫొటోలు లీకవడం చిత్ర బృందానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. -
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
‘ప్రసన్నవదనం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ వేదికపై సుహాస్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. -
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!