26 మిలియన్ల వ్యూస్‌ వచ్చిన ప్రోమో ఇది...

ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్‌ షో గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మెరికల్లాంటి డ్యాన్సర్లతో నిర్వహిస్తున్న షో ఇది. ప్రతి వారం

Updated : 13 Jul 2021 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీలో ప్రతి బుధవారం ప్రసారమయ్యే ‘ఢీ’ డ్యాన్స్‌ షో గురించి అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా ఉన్న మెరికల్లాంటి డ్యాన్సర్లతో నిర్వహిస్తున్న షో ఇది. ప్రతి వారం ‘ఢీ’ షో ఎపిసోడ్‌, ప్రోమోలకు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ వస్తుంటాయి. అలా ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌ ప్రోమోకు కూడా యూట్యూబ్‌లో మంచి ఆదరణ దక్కింది. ప్రోమోను అప్‌లోడ్‌ చేసిన ‘ఈటీవీ ఢీ’, ‘మల్లెమాల టీవీ’ యూట్యూబ్‌ ఛానల్స్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. రెండు ఛానల్స్‌లో‌ కలిపి 26 మిలియన్లకుపైగా వ్యూస్‌ వచ్చాయి. ‘నీ పక్కన పడ్డాది లేదు చూడొలే పిల్లా నాదీ నక్కిలీసు గొలుసు..’ పాటకు పండు వేసిన డ్యాన్స్‌ ఈ ప్రోమోకు హైలైట్‌. బాబీ చేసిన ‘జులాయి’ పాట, ‘జాబిల్లి కోసం ఆకాశమల్లే..’ అంటూ సోమేశ్‌ ఇచ్చిన ప్రదర్శన అదుర్స్‌ అనిపించాయి. మరి అంతమంది చూసిన  ప్రోమోను మీరూ చూసేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని