NTR: ‘సంభవం.. నీకే సంభవం’.. బొబ్బిలిపులి @ 40 ఏళ్లు
ఇంటర్నెట్‌డెస్క్: విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు(NTR), దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బొబ్బిలిపులి’ (Bobbili Puli). అవినీతి, లంచగొండితనంపై రూపుదిద్దుకున్న ఈ సినిమా ఆ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎన్నో థియేటర్లలో శతదినోత్సవ వేడుకలు జరుపుకొంది. ‘‘కోర్టు కోర్టుకి.. తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానాల్లో న్యాయం ఉన్నట్టా..?’’, ‘‘మహాత్మగాంధీ ఒక్కడే నడుం కడితే యావత్ దేశమే ఆయన వెనుక వచ్చింది. అల్లూరి సీతారామరాజు ఒక్కడే విల్లు పడితే.. మన్యం మన్యమే ఆయన వెంట కదిలి వచ్చింది. భగత్‌సింగ్ ఒక్కడే.. యావత్ యువశక్తి ఆయన వెంట వచ్చింది’’ అంటూ ఎన్టీఆర్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్‌లు, ‘సంభవం నీకే సంభవం’, ‘జననీ జన్మభూమిశ్చ’ వంటి పాటలు ప్రతి ఒక్క ప్రేక్షకుడితో చప్పట్లు కొట్టించాయి. ఈ బ్లాక్‌బస్టర్ సినిమా విడుదలై జులై 9తో 40 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘బొబ్బిలిపులి’కి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విశేషాలతో మీ ముందుకు వస్తోంది ఈ వారం ‘ఈటీవీ టాకీస్’. ‘సంభవం నీకే సంభవం’ పేరుతో జులై 8వ తేదీ రాత్రి 10 గంటలకు, జులై 9వ తేదీ ఉదయం 10.30 గంటలకు ప్రసారం కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
CM Jagan: ఆ పోరాటం ప్రపంచ మానవాళికి మహోన్నత చరిత్ర.. తిరుగులేని స్ఫూర్తి: సీఎం జగన్
-
Ap-top-news News
Jhanda uncha rahe hamara : ఆ గీతాన్ని రాసినందుకు జైలు శిక్ష..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
-
India News
PM Modi: అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచింది: ప్రధాని మోదీ
-
Ts-top-news News
TSRTC: 75 ఏళ్లు దాటిన వారికి నేడు ఉచిత ప్రయాణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (15-08-2022)
- Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్
- Jadeja : రవీంద్ర జడేజా కంప్లీట్ ప్యాకేజ్.. కానీ భారీగా వికెట్లు తీస్తాడని మాత్రం ఆశించొద్దు!
- Taiwan: అగ్రరాజ్యం దూకుడు! తైవాన్‌లో అడుగుపెట్టిన మరో అమెరికా బృందం
- Liger: సూపర్‌స్టార్ అంటే ఇబ్బందిగా ఫీలవుతా.. నేనింకా చేయాలి: విజయ్ దేవరకొండ
- Crime News: న్యాయస్థానం ఆవరణలోనే భార్య గొంతుకోశాడు
- Kohinoor Diamond: కోహినూర్ సహా కొల్లగొట్టినవెన్నో.. ఇప్పటికీ లండన్ మ్యూజియాల్లో..
- Meena: అవయవదానానికి ముందుకొచ్చిన నటి మీనా
- Exercise: వ్యాయామం చేస్తే..ఆరోగ్యం మీ సొంతం