ప్రియుడి కోసం

దొండపాటి వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఏడా తానున్నాడో’. అభినవ్‌ మణికంఠ కథానాయకుడు. కోమలి ప్రసాద్‌ కథానాయిక. గుజ్జా యుగంధర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని  శనివారం విడుదల చేశారు. తాను ప్రేమించిన అబ్బాయి కోసం,

Published : 05 Dec 2021 03:05 IST

దొండపాటి వంశీకృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఏడా తానున్నాడో’. అభినవ్‌ మణికంఠ కథానాయకుడు. కోమలి ప్రసాద్‌ కథానాయిక. గుజ్జా యుగంధర్‌ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ని  శనివారం విడుదల చేశారు. తాను ప్రేమించిన అబ్బాయి కోసం, అతని జ్ఞాపకాల దారుల్లో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసిన ఓ భగ్న ప్రేయసి కథతో... రోడ్‌ ట్రిప్‌ సినిమాగా తెరకెక్కించారు. సాహసోపేతమైన అంశాలు, థ్రిల్లింగ్‌ అంశాలతో పలు మలుపులుతో సాగే ఈ సినిమాలో ప్రేమికులు కలిశారా? లేదా? అన్నది ఆసక్తికరమని సినీ వర్గాలు తెలిపాయి. ‘‘దిల్‌రాజు నిర్మాణ సంస్థలో ఏడేళ్లపాటు రచన, దర్శకత్వ విభాగాల్లో పనిచేసిన అనుభవం దర్శకుడికి ఉంది. స్వచ్ఛమైన ప్రియురాలిగా కోమలి ప్రసాద్‌ నటన సినిమాకే ఆకర్షణగా నిలుస్తుంద’’ని చిత్రబృందం తెలిపింది. సంగీతం: చరణ్‌ అర్జున్‌, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని