పది గంటల్లో తీసిన చిత్రమిది

అదిరే అభి (అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయికృష్ణ, నేహా, నందకిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకుడు. గ్రంధి శివ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా..

Published : 05 Dec 2021 03:05 IST

దిరే అభి (అభినయ కృష్ణ), వాణి, తల్లాడ సాయికృష్ణ, నేహా, నందకిషోర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘వైట్‌ పేపర్‌’. శివ దర్శకుడు. గ్రంధి శివ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే టీజర్‌ను ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈరోజుల్లో పది గంటల్లో ఓ సినిమా చేయడమంటే చిన్న విషయం కాదు. మీరు పడిన కష్టాన్ని, కృషిని మనస్ఫూర్తిగా అభినందించాలి. రొటీన్‌కు భిన్నమైన మంచి కథను ఎంచుకుని సినిమా తీసిన శివ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. అభి హీరోగా మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హీరో అభి మాట్లాడుతూ.. ‘‘నాలుగు కెమెరాలతో పది గంటల్లో సినిమా చేశాం. ఓ ఫోన్‌ బూత్‌ నేపథ్యంలో.. ఒకే లొకేషన్లో జరిగే కథ ఇది. మా ప్రయత్నానికి మెచ్చి ఇండియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ వారు సత్కరించార’’న్నారు. ఈ కార్యక్రమంలో గెటప్‌ శ్రీను, రాఘవ, హైపర్‌ ఆది, సాయి రాజేష్‌, రమేష్‌, లోబో తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని