సంక్షిప్త వార్తలు (2)

వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి నుంచి మరో కొత్త చిత్రం రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాని చిత్రబృందం ప్రకటించింది. నిశ్శబ్ద చిత్రంగా డార్క్‌ కామెడీ కథాంశంతో కిషోర్‌ పి బాలేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి ‘గాంధీ టాక్స్‌’ అనే పేరుని ఖరారు చేశారు.

Updated : 03 Oct 2022 04:32 IST

నిశ్శబ్ద చిత్రం ‘గాంధీ టాక్స్‌’

వైవిధ్య పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న విజయ్‌ సేతుపతి నుంచి మరో కొత్త చిత్రం రాబోతుంది. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాని చిత్రబృందం ప్రకటించింది. నిశ్శబ్ద చిత్రంగా డార్క్‌ కామెడీ కథాంశంతో కిషోర్‌ పి బాలేకర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి ‘గాంధీ టాక్స్‌’ అనే పేరుని ఖరారు చేశారు. అదితీరావ్‌ హైదరి, అరవింద్‌ స్వామి కీలక పాత్రల్లో నటించనున్నారు. ఎ ఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్న ఈ సినిమాని జీ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. 2023లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


సరదా సరదాగా...

ది సాయికుమార్‌ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘క్రేజీ ఫెలో’. దిగంగన సూర్యవంశీ,  మిర్నా మేనన్‌ కథానాయికలు. ఫణికృష్ణ సిరికి దర్శకుడు. కె.కె.రాధామోహన్‌ నిర్మాత. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ని ఆదివారం విడుదల చేశారు. సరదా సరదా సన్నివేశాలతో ట్రైలర్‌ సాగుతుంది. ‘‘కుటుంబ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి హాస్యం, యాక్షన్‌ అంశాలు ప్రధానబలం. ఆది స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తాడ’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts