సేనాపతి రాక కోసం ఏర్పాట్లు

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా అడ్డంకులు దాటింది. ఇప్పుడు మాత్రం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు శంకర్‌.

Published : 03 Dec 2022 01:36 IST

మల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇండియన్‌ 2’ సెట్స్‌పైకి వెళ్లడానికి చాలా అడ్డంకులు దాటింది. ఇప్పుడు మాత్రం చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు శంకర్‌. ఓ పక్క రామ్‌చరణ్‌తో సినిమా తీస్తూనే ‘ఇండియన్‌ 2’నీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. చెన్నై విమానాశ్రయంలో చిత్రీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సేనాపతి విదేశాల నుంచి తిరిగి భారత్‌కు వచ్చే సన్నివేశాలను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 5 నుంచి షెడ్యూల్‌ మొదలుకానుంది. తొలి చిత్రాన్ని మించి విజయం సాధించేలా ఈ చిత్రాన్ని శంకర్‌ తీర్చిదిద్దుతున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. కాజల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియ భవానీ శంకర్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబరులో విడుదల చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని