ఆ రావణుడెవరు?

‘రావణాసుర’గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Published : 27 Jan 2023 01:30 IST

‘రావణాసుర’గా థ్రిల్‌ పంచేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. గురువారం రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి గ్లింప్స్‌ను విడుదల చేశారు. అందులో రవితేజ రెండు కోణాలున్న పాత్రలో కనిపించారు. ఓవైపు న్యాయవాదిగా శక్తిమంతంగా కనిపిస్తూనే.. మరో గెటప్‌లో స్టైలిష్‌ లుక్‌తో దర్శనమిచ్చారు. ఈ ప్రచార చిత్రంలో ఓ అజ్ఞాత వ్యక్తి అమ్మాయిల్ని వరుసగా హత్య చేయడం ఆసక్తి రేకెత్తించింది. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? వాటికీ రవితేజకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ‘రావణాసుర’ టైటిల్‌ పెట్టడానికి కారణమేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. విభిన్నమైన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగర్కార్‌, పూజిత పొన్నాడ నాయికలుగా నటిస్తున్నారు. సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని