పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా

‘మసూద’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు నటుడు తిరువీర్‌. ఇప్పుడాయన హీరోగా ఏషియన్‌ ఫిలిమ్స్‌ నారాయణ దాస్‌ నారంగ్‌ సమర్పణలో ఓ సినిమా రూపొందుతోంది.

Published : 11 Apr 2023 05:07 IST

‘మసూద’ చిత్రంతో ప్రేక్షకుల్ని మెప్పించారు నటుడు తిరువీర్‌. ఇప్పుడాయన హీరోగా ఏషియన్‌ ఫిలిమ్స్‌ నారాయణ దాస్‌ నారంగ్‌ సమర్పణలో ఓ సినిమా రూపొందుతోంది. కొత్త దర్శకుడు జి.జి తెరకెక్కిస్తున్నారు. రవికుమార్‌ పనస నిర్మాత. ఈ చిత్రాన్ని సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మాత రవికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక విభిన్నమైన పీరియడ్‌ యాక్షన్‌ డ్రామా. మునుపెన్నడూ చూడని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతుంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో టైటిల్‌ ప్రకటిస్తాం’’ అన్నారు.  


నవ్వులు పంచే ‘సేవ్‌ ద టైగర్స్‌’

ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ, పావని, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ ‘సేవ్‌ ద టైగర్స్‌’. తేజ కాకుమాను తెరకెక్కించారు. మహి వి.రాఘవ, ప్రదీప్‌ అద్వైతం షోరన్నర్స్‌గా వ్యవహించారు. ఈ సిరీస్‌ ఈ నెల 27న ప్రముఖ ఓటీటీలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సోమవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహి వి.రాఘవ మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఇంట్లోనూ ఓ వినోదభరితమైన కథ ఉంటుంది. అలాంటి ఓ ఫన్నీ కథతోనే ఈ సిరీస్‌ రూపొందింది. ఆడవారి వల్ల మగవాళ్లు పడే బాధల్ని ఇందులో వినోదాత్మకంగా చూపించాం’’ అన్నారు. ‘

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని