థ్రిల్‌ని పంచే... ‘చక్రవ్యూహమ్’
అజయ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘చక్రవ్యూహం’. ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. మధుసూదన్ దర్శకత్వం వహించారు. సావిత్రి నిర్మాత.
అజయ్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం ‘చక్రవ్యూహం’. ది ట్రాప్ అనేది ఉపశీర్షిక. మధుసూదన్ దర్శకత్వం వహించారు. సావిత్రి నిర్మాత. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌పై శశిధర్ రెడ్డి ఈ శుక్రవారం చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. ఓ హత్య నేపథ్యంలో సాగే చిత్ర కథ, కథనాలు ఆకట్టుకుంటాయి. ట్రైలర్‌కి మంచి స్పందన లభిస్తోంది. చిత్రం తప్పకుండా ప్రేక్షకులకి వినోదం పంచుతుంది’’ అన్నారు. అజయ్ మాట్లాడుతూ ‘‘కథపై పట్టున్న దర్శకుడు మధుసూదన్. ఆయన ఈ సినిమాని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించారు. తప్పక సినిమాని ప్రేక్షకుల్ని థ్రిల్‘కి గురిచేస్తుంది. ఈ సినిమాని ఆదరించి కొత్త దర్శకుడికి ప్రోత్సాహం అందించాల’’ని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.