‘డాంగ్‌ డాంగ్‌’ ఫుల్‌ వీడియో ఆగయా..!

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు - మిల్కీబ్యూటీ తమన్నా డ్యాన్స్‌తో మెమ్సరైజ్‌ చేశారు. మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి బాక్సాఫీస్‌గా...

Updated : 30 Jan 2020 17:16 IST

డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేస్తున్న తమన్నా, మహేశ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు - మిల్కీబ్యూటీ తమన్నా డ్యాన్స్‌తో మెస్మరైజ్‌ చేశారు. మహేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించి బాక్సాఫీస్‌గా బాప్‌గా నిలిచిన ఈ సినిమా అటు దర్శకుడు అనిల్‌ రావిపూడితోపాటు ఇటు మహేశ్‌కు కూడా కెరీర్‌లో ఓ మంచి హిట్‌ను అందించింది. అయితే ఈ సినిమా మిల్కీబ్యూటీ తమన్నా ‘డాంగ్‌ డాంగ్’ అనే పార్టీ సాంగ్‌తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఈ పాటలో తమన్నా, మహేశ్‌ వేసిన స్టెప్పులు థియేటర్లలో ప్రేక్షకుల చేత విజిల్స్‌ వేయించాయి.ఈ నేపథ్యంలో చిత్రబృందం నేడు ‘డాంగ్‌ డాంగ్‌’ పాట పూర్తి వీడియోను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ.. దేవిశ్రీ సంగీతం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ కనిపించిన ఈ సినిమాలో ఆయనకు జంటగా రష్మిక నటించారు. విజయశాంతి, రావు రమేశ్‌, రాజేంద్రప్రసాద్‌, ప్రకాశ్‌రాజ్‌ , సంగీత కీలకపాత్రలు పోషించారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని