Ramabanam ott release: ఎట్టకేలకు ఓటీటీలో ‘రామబాణం’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Rama banam ott release: గోపిచంద్‌, డింపుల్‌ హయాతీ కీలక పాత్రల్లో నటించిన ‘రామబాణం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Published : 07 Sep 2023 13:13 IST

హైదరాబాద్‌: గోపీచంద్‌ (Gopi Chand) కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ప్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘రామబాణం’ (Rama banam ott release). డింపుల్‌ హయాతి కథానాయిక. శ్రీవాస్‌ దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మెప్పించలేకపోయింది. గోపిచంద్‌-శ్రీవాస్‌ హిట్ కాంబినేషన్‌ ఆ మేజిక్‌ను పునరావృతం చేయలేకపోయింది. మరోవైపు ‘రామబాణం’ ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూసిన గోపిచంద్‌ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. సెప్టెంబరు 14వ తేదీ నుంచి ‘రామబాణం’ మూవీని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు తెలిపింది.

అందుకే ‘అంజి’ తీయడానికి ఐదేళ్లు.. ఒక్క ఇంటర్వెల్‌ సీక్వెన్స్‌ నెలరోజులు తీశారు!

క‌థేంటంటే: రాజారామ్ (జ‌గ‌ప‌తిబాబు) త‌న ఊళ్లో సుఖీభ‌వ పేరుతో హోట‌ల్ న‌డుపుతుంటాడు. ప్ర‌జ‌ల ఆరోగ్యమే ప‌ర‌మావ‌ధి అనుకునే ఆయ‌న‌... సంప్ర‌దాయ వంట‌కాల్ని త‌యారు చేయిస్తూ త‌క్కువ ధ‌రల‌కే అందుబాటులో ఉంచుతుంటాడు. వ్యాపారంలో పోటీదారుల‌కి అది కంట‌గింపుగా మారుతుంది. జీకే (త‌రుణ్ అరోరా), అత‌ని మామ (నాజ‌ర్‌) సుఖీభ‌వ హోట‌ల్‌పై దౌర్జ‌న్యానికి పాల్ప‌డి లైసెన్స్ తీసుకెళ్లిపోతారు. దాంతో రాజారామ్ త‌మ్ముడైన విక్కీ (గోపీచంద్‌) రాత్రికి రాత్రే వాళ్ల ఇంటిపై దాడిచేసి లైసెన్స్ తీసుకొస్తాడు. నీతి నిజాయ‌తీగా మెలిగే రాజారామ్ ఏదైనా చ‌ట్ట ప‌రిధిలోనే చేయాల‌ని భావిస్తుంటాడు. త‌న త‌మ్ముడు విక్కీ చేసిన ప‌ని న‌చ్చ‌ని రాజారామ్... ఇలాంటివి చేస్తే జీవితంలో ఉన్న‌తంగా ఎద‌గ‌లేమ‌ని చెబుతూ అత‌న్ని పోలీసుల‌కి అప్ప‌జెప్పేందుకు వెళ‌తాడు. ఇంత‌లో విక్కీ తాను ఎప్ప‌టికైనా ఉన్న‌తంగా ఎదిగి తిరిగొస్తానంటూ త‌ప్పించుకుని కలకత్తా వెళ్లిపోతాడు. అక్క‌డికి వెళ్లిన విక్కీ ఏం చేశాడు? ప‌దిహేనేళ్ల త‌ర్వాత తిరిగి రావ‌ల్సిన అవ‌స‌రం ఆయ‌న‌కి ఎందుకొచ్చింది? వ‌చ్చాక ఏం జ‌రిగింద‌నేది అస‌లు క‌థ‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని