Ashish Reddy: దిల్‌ రాజు ఇంట వేడుక.. హీరో ఆశిష్ నిశ్చితార్థం

హీరో ఆశిష్‌ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు గురువారం ఆయన నిశ్చితార్థం జరిగింది.

Published : 01 Dec 2023 02:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) ఇంట త్వరలోనే పెళ్లిబాజాలు మోగనున్నాయి. ఆయన సోదరుడు, నిర్మాత శిరీష్‌ తనయుడు ఆశిష్‌ రెడ్డి (Ashish Reddy) ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అద్విత రెడ్డి అనే అమ్మాయిని ఆయన వివాహం చేసుకోనున్నారు. గురువారం వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరై సందడి చేశారు. అద్విత తండ్రి వ్యాపారవేత్త అని సమాచారం. వివాహాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

సైలెంట్‌గా.. కిరాక్‌ ఆర్పీ వివాహం

‘రౌడీబాయ్స్‌’ (Rowdy Boys) సినిమాతో ఆశిష్‌ తెరంగేట్రం చేశారు. గతేడాది సంక్రాంతికి విడుదలైందీ సినిమా. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారాయన. విశాల్‌ కాశీ దర్శకత్వంలో నటిస్తున్న ‘సెల్ఫిష్‌’ (Selfish) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ‘లవ్‌టుడే’ ఫేమ్‌ ఇవానా హీరోయిన్‌గా సందడి చేయనుంది. ఆశిష్‌ హీరోగా ఇటీవల ఓ సినిమా పట్టాలెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని