Dhanush: ‘ఇళయరాజా జీవితం... ధనుష్‌ హీరోగా’

‘తమిళ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా జీవితాన్ని తెరకెక్కించాలన్న కోరిక ఉంది’ అని అంటున్నారు బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌.బాల్కి.

Updated : 04 Aug 2023 14:01 IST

‘తమిళ హీరో ధనుష్‌ ప్రధాన పాత్రలో మ్యూజిక్‌ మాస్ట్రో ఇళయరాజా జీవితాన్ని తెరకెక్కించాలన్న కోరిక ఉంది’ అని అంటున్నారు బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌.బాల్కి. ఆయన దర్శకత్వంలో ధనుష్‌ తీసిన హిందీ సినిమా ‘షమితాబ్‌’. అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బాల్కి మాట్లాడుతూ...‘నాకు ఇళయరాజా గారి జీవితంపై సినిమా తీయాలని ఉంది. అది కూడా ధనుష్‌ హీరోగా. వారిద్దరి పోలికలు కొంచెం దగ్గరగా అనిపిస్తాయి. ధనుష్‌ కూడా ఆయనకి పెద్ద అభిమాని కాబట్టి ఈ ప్రాజెక్టు కోసం ధనుష్‌ ఒప్పుకుంటారు’ అని తెలిపారు. ప్రస్తుతం ‘కెప్టెన్‌ మిల్లర్‌’, స్వీయ దర్శకత్వంలో ‘డీ50’, శేఖర్‌ కమ్ములతో ‘డీ51’,  బాలీవుడ్‌లో ‘తేరే ఇష్క్‌ మైన్‌’ చిత్రాలతో బిజీగా ఉన్న ధనుష్‌ ఆ దర్శకుడి కలను నెరవేరుస్తారో లేదో చూడాలి మరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని