indiana jones 5: ఓటీటీలో ‘ఇండియానా జోన్స్‌5’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

యాక్షన్‌, అడ్వెంచర్‌ సినీ ప్రియులను ఎంతగానో అలరించాయి ‘ఇండియానా జోన్స్‌’ చిత్రాలు. నిధి వేట, అపురూప వస్తువులను అన్వేషించే కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు.

Published : 15 Aug 2023 19:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యాక్షన్‌, అడ్వెంచర్‌ సినీ ప్రియులను ఎంతగానో అలరించాయి ‘ఇండియానా జోన్స్‌’ చిత్రాలు. నిధి వేట, అపురూప వస్తువులను అన్వేషించే కథా నేపథ్యంలో సాగే ఈ చిత్రాలకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఈ జానర్‌లో వచ్చిన చివరి చిత్రం ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ (indiana jones 5). ఇండియానా జోన్స్‌గా హారిసన్‌ ఫోర్డ్‌ మరోసారి అలరించారు. జూన్‌ 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.  ప్రముఖ ఓటీటీ వేదికలు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, యాపిల్ టీవీల్లో ఆగస్టు 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. తొలుత వీడియో ఆన్‌ డిమాండ్‌ ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకురానున్నారు. అంటే కొంత మొత్తం అద్దె చెల్లించి మూవీ చూడాలన్నమాట. అలాగే డిస్నీ+హాట్‌స్టార్‌లోనూ ఈ మూవీని తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, స్ట్రీమింగ్‌ తేదీని మాత్రం ప్రకటించలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని