Adipurush: టాంజానియా వాసి నోట.. ‘ఆదిపురుష్‌’ పాట

ప్రభాస్‌ హీరోగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన చిత్రం.. ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాలోని ‘రామ్‌ సియా రామ్‌’ పాటను టాంజానియా వాసి, ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ కిలి పాల్‌ అనుకరించి, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Published : 12 Jun 2023 00:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కిలి పాల్‌ (Kili Paul).. సోషల్‌ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే వారికి పరిచయం అక్కర్లేని పేరు. టాంజానియాకు చెందిన ఈయన భారతీయ సినిమాల్లోని పాటలను అనుకరిస్తూ డ్యాన్స్‌ చేయడంతో మంచి గుర్తింపు పొందారు. లక్షలాది ఫాలోవర్స్‌ను పొంది, ఇంటర్నెట్‌ సెన్సేషన్‌గా మారారు. తాజాగా ఆయన అనుకరించిన ‘రామ్‌ సియా రామ్‌’ (Ram Siya Ram) (హిందీ) వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంబంధిత వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ఆదిపురుష్‌, అందులోని ‘రామ్ సియా రామ్’ పాట దైవత్వం.. హద్దులన్నీ చేరిపేసి ప్రపంచవ్యాప్తంగా అందరి హృదయాలను ఏకం చేస్తోంది అని పేర్కొంది.

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన సినిమానే ‘ఆదిపురుష్‌’ (Adipurush). రామాయణం ఆధారంగా దర్శకుడు ఓంరౌత్‌ (Om Raut) రూపొందించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌ (Prabhas), సీతగా కృతిసనన్‌ (Kriti Sanon), రావణాసురుడు/లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan) నటించారు. సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 16న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇటీవల విడుదలైన ట్రైలర్‌, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. ఈ క్రమంలోనే కిలి పాల్‌.. రామ భక్తితో ఆ పాటను అనుకరించారు.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని