Suriya: సూర్యతో దుల్కర్‌ సల్మాన్‌.. కార్తికి ఛాన్స్‌ మిస్‌?

‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) (Soorarai Pottru)తో హిట్‌ కాంబోగా నిలిచారు డైరెక్టర్‌ సుధా కొంగర (Sudha Kongara Prasad), హీరో సూర్య (suriya).

Published : 29 Jul 2023 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సూరారై పోట్రు’ (ఆకాశం నీ హద్దురా) (Soorarai Pottru)తో హిట్‌ కాంబోగా నిలిచారు డైరెక్టర్‌ సుధా కొంగర (Sudha Kongara Prasad), హీరో సూర్య (suriya). వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయనున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దానిపై స్పష్టత రాకపోగా ఇప్పుడు మరో రూమర్‌ కోలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం సుధా.. మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan)ని సంప్రదించారట. దుల్కర్‌కు స్క్రిప్టు నచ్చిందని, ఆయన సూర్యతో కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారనే టాక్‌ వినిపిస్తోంది. అయితే, ముందుగా ఆ కీ రోల్‌ కోసం సూర్య సోదరుడు కార్తి (Karthi)ని అనుకున్నారట. కారణమేంటోగానీ కార్తికి సూర్యతో తెరను పంచుకునే అవకాశం మిస్‌ అయింది. సూర్యకి ఇది 43వ చిత్రంకానుంది. ‘సూరారై పోట్రు’కు సంగీతం అందించిన జీవీ ప్రకాశ్‌ కుమార్‌ ఈ సినిమాకీ స్వరాలు సమకూర్చనున్నారని, ఇది ఆయనకు 100వ ప్రాజెక్టుకానుందని అంటున్నారు. ఈ మూవీ డిసెంబరులో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

బికినీలో శ్రద్ధ.. దివి కవిత్వం.. తమన్నా డ్యాన్స్‌ రిహార్సల్స్‌..!

‘బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో ‘సూరారై పోట్రు’ జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో ప్రస్తుతం రీమేక్‌ చేస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar) హీరోగా నటిస్తుండగా, సూర్య అతిథిగా కనిపించనున్నారు. దుల్కర్‌ విషయానికొస్తే.. ఆయన నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కోత’ (King of Kotha) విడుదలకు సిద్ధంగా ఉంది. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar) సినిమా ప్రకటన వెలువడింది. వెంకీ అట్లూరి (Venky Atluri) ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని