Sai Pallavi: బాలీవుడ్‌కి సాయి పల్లవి?

సాయిపల్లవి బాలీవుడ్‌ పరిచయంపై ఎన్నో ఏళ్లుగా ప్రచారం వినిపిస్తూనే ఉంది. కానీ, ఇంత వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఆమె కూడా గతంలో పలు హిందీ కథలు విన్నానని.. ఏదీ తనని మెప్పించలేదని ఎన్నోసార్లు వెల్లడించింది.

Updated : 15 Sep 2023 14:01 IST

సాయిపల్లవి బాలీవుడ్‌ పరిచయంపై ఎన్నో ఏళ్లుగా ప్రచారం వినిపిస్తూనే ఉంది. కానీ, ఇంత వరకు ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఆమె కూడా గతంలో పలు హిందీ కథలు విన్నానని.. ఏదీ తనని మెప్పించలేదని ఎన్నోసార్లు వెల్లడించింది. అయితే ఇప్పుడు సాయిపల్లవి హిందీలో ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్లు సమాచారం అందుతోంది. ఆమిర్‌ ఖాన్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని తెలిసింది. సునీల్‌ పాండే దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించుకుంది. త్వరలో సాయిపల్లవి పేరును అధికారికంగా ప్రకటించనున్నారంటూ బాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ప్రస్తుతం తమిళంలో శివ కార్తికేయన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని