sakshi vaidya: శర్వానంద్‌కి జోడీగా సాక్షి వైద్య

అవకాశాల్ని అందుకోవడంలో జోరు ప్రదర్శిస్తోంది సాక్షి వైద్య. ‘ఏజెంట్‌’తో పరిచయమైన ఈమె... ఇటీవలే ‘గాండీవధారి అర్జున’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 30 Aug 2023 14:16 IST

వకాశాల్ని అందుకోవడంలో జోరు ప్రదర్శిస్తోంది సాక్షి వైద్య. ‘ఏజెంట్‌’తో పరిచయమైన ఈమె... ఇటీవలే ‘గాండీవధారి అర్జున’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంచి స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటున్న ఈమె... ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’లో పవన్‌కల్యాణ్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. త్వరలోనే శర్వానంద్‌తోనూ జట్టు కట్టనుంది. కల్యాణ్‌ శంకర్‌ దర్శకత్వంలో శర్వానంద్‌ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది. అందులోనే సాక్షి వైద్య కథానాయికగా ఖరారైంది. ఈ కలయికలో సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని