Vijay Deverakonda: విజయ్‌ దేవరకొండకు జోడీగా?

వేసవి బరిలో ‘ఫ్యామిలీస్టార్‌’గా సందడి చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. పరశురామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది.

Updated : 21 Jan 2024 11:48 IST

వేసవి బరిలో ‘ఫ్యామిలీస్టార్‌’గా సందడి చేయనున్నారు విజయ్‌ దేవరకొండ. పరశురామ్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఇది పూర్తి కాగానే విజయ్‌ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌ చిత్రం తిరిగి పట్టాలెక్కనుంది. ఈ సినిమా కోసం తొలుత శ్రీలీలను కథానాయికగా ఎంచుకోగా అనివార్య కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అయితే ఇప్పుడా అవకాశాన్ని బాలీవుడ్‌ భామ త్రిప్తి దిమ్రి అందిపుచ్చుకున్నట్లు సమాచారం. ఇప్పటికే చిత్ర బృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని.. స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె సినిమా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఓ చిన్న షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి నెలాఖరు నుంచి తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. దీన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక త్రిప్తి ‘యానిమల్‌’లో కీలక పాత్రలో కనిపించి.. సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని