ఉత్కంఠభరితంగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్‌!

గతేడాది వచ్చిన ‘నాంది’ చిత్రంతో హిట్‌ కొట్టి హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు అల్లరి నరేశ్‌. గమ్యం, మహర్షి, నాంది చిత్రాలతో  నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో  ప్రత్యేక స్థానం సంపాదించారు.

Published : 30 Jun 2022 20:37 IST

రియల్‌ హీరో పాత్రలో ఆకట్టుకున్న అల్లరి నరేశ్‌.

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతేడాది వచ్చిన ‘నాంది’ చిత్రంతో హిట్‌ కొట్టి హీరోగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు అల్లరి నరేశ్‌. గమ్యం, మహర్షి, నాంది చిత్రాలతో  నటుడిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. విలక్షణ నటుడిగా ప్రేక్షకుల్లో  ప్రత్యేక స్థానం సంపాదించారు.ఈ రోజు అల్లరినరేశ్‌ పుట్టినరోజు సందర్భంగా, ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఆసక్తికరమైన సంభాషణలు, విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌ యాక్షన్‌ సీన్లు, ఉత్కంఠ కలిగించే డ్రామాతో టీజర్‌ ఆద్యంతం అలరించింది. ఎన్నికల అధికారి పాత్రలో అల్లరి నరేశ్‌ సింపుల్‌ లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంది. ఏజెన్సీ ప్రజల వెనుకబాటుతనాన్ని వెల్లడిస్తూ ఆయన పలికించిన సంభాషణలు ఆలోచించే విధంగా ఉన్నాయి. అల్లరి నరేశ్‌ 59వ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts