Attack 1: ఆ నమ్మకం ఉంది
అటాక్-1... బాలీవుడ్ యాక్షన్ కథానాయకుడు జాన్అబ్రహం నటిస్తున్న చిత్రం. దీనికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ
అటాక్-1... బాలీవుడ్ యాక్షన్ కథానాయకుడు జాన్అబ్రహం నటిస్తున్న చిత్రం. దీనికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ సినిమా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జాన్ అబ్రహం మాట్లాడుతూ... ‘‘భారత దేశంలో రూపొందుతున్న తొలి పూర్తిస్థాయి సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రమిది. భవిష్యత్తులో ఇలాంటి చిత్రాలు చేయడానికి కథానాయకులూ ముందుకు వస్తారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం విడుదలైన వారానికే మేం వస్తున్నాం. అయినా దేశంలో మాకు తగిన థియేటర్లు దొరుకుతున్నాయి. రాజమౌళి చిత్రాలంటే మాకు అమితమైన గౌరవం ఉంది. అలాగే మా చిత్రంపైనా మాకు నమ్మకం ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులకు చూపించడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని మేం భావిస్తున్నాం. అద్భుతమైన యాక్షన్ ఘట్టాలు, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్ ఇందులో ఉన్నాయి. యువతనే కాదు అందర్నీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది’’ అని పేర్కొన్నారు. లక్ష్య రాజ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, రకుల్‌ప్రీత్ సింగ్, ప్రకాష్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిజ జీవిత కథలంటే ప్రత్యేక బాధ్యత
కలల్ని సాకారం చేసుకోవడానికీ... సమున్నత లక్ష్యాల్ని చేరుకోవడానికి అంధత్వం అడ్డు రాదని చాటుతూ పారిశ్రామిక వేత్తగా ఎదిగిన తెలుగు తేజం... శ్రీకాంత్ బొల్లా. బొల్లాంట్ ఇండస్ట్రీస్‌ని స్థాపించిన ఆయన జీవితం ఆధారంగానే ‘శ్రీకాంత్’ చిత్రం తెరకెక్కింది. -
నాయికలూ.. రికార్డులు బద్దలు కొట్టగలరు!
బాలీవుడ్ సీనియర్ నాయిక కరీనాకపూర్ టాప్‌గేర్‌లో దూసుకెళ్తోంది. ఆమె నటించిన ‘క్రూ’ ఒకవైపు మంచి కలెక్షన్లు కురిపిస్తుంటే.. మరోవైపు ఆమె ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్‌కి భారత్ జాతీయ ప్రచారకర్తగా ఎంపికైంది. -
నిజమైన బలం అదే
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమయ్యే అభిప్రాయాలపైనా... సాగే చర్చపైనా స్పందించకూడదని సమంత నిర్ణయించుకుందా? ఆమె ఇన్‌స్టాలో పంచుకున్న ఓ పోస్ట్ ఆ అభిప్రాయాన్నే సూచిస్తోంది. -
రాయన్ వస్తున్నాడు
ధనుష్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘రాయన్’. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. -
ఓటీటీలోకి నేరుగా ‘విద్యా వాసుల అహం’
రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ జంటగా మణికాంత్ గెల్లి తెరకెక్కించిన చిత్రం ‘విద్యా వాసుల అహం’. మహేశ్ దత్త మొతూరు, లక్ష్మీ నవ్య మక్కపాటి సంయుక్తంగా నిర్మించారు. -
‘టైటానిక్’ కెప్టెన్ కన్నుమూత
‘టైటానిక్’, ‘ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్’లాంటి చిత్రాల్లో మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ (79) కన్నుమూశారు. -
‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ షురూ
యావత్తు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్ 3’ చిత్రీకరణ మొదలైంది. తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్లో తెలుగు ద్వయం రాజ్, డీకే ఈ వెబ్‌సిరీస్ రూపొందిస్తున్నారు. -
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
కమెడియన్ తనను అనుకరించడంపై కరణ్ జోహార్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా బాధ పడ్డారు. -
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
గుడ్‌న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్ సినీ ప్రియులకు శుభవార్త చెప్పింది. -
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
తాను ఆస్పత్రిలో చేరినట్టు నటి దక్ష నగర్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. -
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
‘బ్రహ్మాస్త్ర’లోని ‘కేసరియా’ పాట రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతోంది.