BIMBISARA: ‘బింబిసార’ ఆగమనం ఆరోజే

కల్యాణ్‌రామ్‌ కథా  నాయకుడిగా వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు.

Updated : 03 Apr 2022 08:05 IST

ల్యాణ్‌రామ్‌ కథా  నాయకుడిగా వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రం ‘బింబిసార’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కె.హరికృష్ణ నిర్మిస్తున్నారు. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఈ  సినిమాని ఆగస్ట్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శనివారం  అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల వేదికగా ఓ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించారు. ‘‘కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతోన్న చిత్రమిది. ఇందులో కల్యాణ్‌రామ్‌ రెండు విభిన్నమైన పాత్రల్లో కనువిందు చేయనున్నారు’’ అని చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాకి చిరంతన్‌ భట్‌ స్వరాలందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని