Kamal Haasan: గురుశిష్యుల కలయిక

అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌ - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే ‘సాగర సంగమం’, ‘శుభ సంకల్పం’ చిత్రాలొచ్చాయి

Updated : 24 Nov 2022 06:46 IST

అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్‌ (K Viswanath) - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan) మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే ‘సాగర సంగమం’, ‘శుభ సంకల్పం’ చిత్రాలొచ్చాయి. తరచూ తన  గురువు కె.విశ్వనాథ్‌ని కలిసి ఆయనతో కాసేపు సమయం గడుపుతుంటారు కమల్‌హాసన్‌. బుధవారం హైదరాబాద్‌కి వచ్చిన ఆయన... కె.విశ్వనాథ్‌ ఇంటికి వెళ్లి కలిశారు. ‘విక్రమ్‌’తో ఇటీవలే విజయాన్ని అందుకున్న కమల్‌హాసన్‌, ప్రస్తుతం ‘భారతీయుడు 2’ చిత్రంలో నటిస్తున్నారు. కెరీర్‌ పరంగా జోరు మీదున్న ఆయన తన గురువు కె.విశ్వనాథ్‌ ఆశీర్వాదం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని