Kamal Haasan: 234వ సినిమాకి శ్రీకారం

కమల్‌ హాసన్‌ - మణిరత్నం కలయికలో రూపొందనున్న కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ‘కేహెచ్‌234’గా సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాని రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 28 Oct 2023 14:09 IST

మల్‌ హాసన్‌ - మణిరత్నం కలయికలో రూపొందనున్న కొత్త చిత్రం శ్రీకారం చుట్టుకుంది. ‘కేహెచ్‌234’గా సెట్స్‌పైకి వచ్చిన ఈ సినిమాని రాజ్‌ కమల్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ‘బిగిన్‌ ది బిగిన్‌’ పేరుతో ఓ ప్రోమోని విడుదల చేశారు. అందులో ‘నాయకుడు’ సినిమాలోని కమల్‌, ప్రదీప్‌ శక్తి మధ్య వచ్చే ఐకానిక్‌ సీక్వెన్స్‌ను చూపించారు. ‘నాయకుడు’.. కమల్‌ - మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా. ఇది 1987లో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విడుదలైన 36ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కొత్త చిత్రం కోసమే వారిద్దరూ తిరిగి చేతులు కలిపారు. అందుకే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రానికి యాక్షన్‌: అన్బు-అరివు, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, ఛాయాగ్రహణం: రవి కె.చంద్రన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని