Updated : 05 Aug 2022 11:01 IST

Kareena Kapoor: షాహిద్‌ని కరీనా మాజీ భర్తంటూ.. నాలుక్కర్చుకున్న కరణ్‌

హీరోయిన్‌ షాక్.. క్షమాపణలు చెప్పిన దర్శకుడు

ముంబయి: బాలీవుడ్‌ నటుడు షాహిద్‌ కపూర్‌ని (Shahid Kapoor) నటి కరీనాకపూర్‌ (Kareena Kapoor) మాజీ భర్తగా సంబోధించి.. వెంటనే నాలుక్కర్చుకున్నారు దర్శకుడు కరణ్‌ జోహార్‌. తన తప్పుని తెలుసుకుని స్టేజ్‌పైనే ఆమెకు క్షమాపణలు చెప్పారు. విశేషమైన ప్రేక్షకాదరణ ఉన్న రియాల్టీ షోలో కరణ్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో కరీనా షాకయ్యారు. కరణ్‌ వ్యాఖ్యలు ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి. కరణ్‌కి ఏం పనిలేదా? ఇతరుల వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తలదూరుస్తున్నారంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Laal Singh Chaddha) చిత్రాన్ని ప్రమోట్‌ చేసేందుకు కరీనా, ఆమిర్‌ఖాన్‌ తాజాగా కరణ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan Show) షోలో పాల్గొని తమ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇందులో భాగంగా వీరిద్దరి వ్యక్తిగత జీవితాలను తెలుసుకునేందుకు కరణ్‌ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తనకెంతో ఆప్తమిత్రురాలైన కరీనా గురించి కరణ్‌ చెబుతూ.. ‘‘బేబో ఈ షోలో నువ్వు ఇప్పటికే ఎన్నోసార్లు పాల్గొన్నావు. ఎన్నో విశేషాలు పంచుకున్నావు. ఒక నటిగా ఈ స్టేజ్‌పై సందడి చేశావు. నీ భర్త సైఫ్‌తో ఓసారి మెరిశావు. ఇక, మాజీ భర్తతో కూడా..’’ అంటూ ఏదో చెప్పబోయారు. వెంటనే  తన తప్పు తెలుసుకుని... ‘‘క్షమించండి. మాజీ భర్త కాదు.. మాజీ ప్రియుడితో ఈ షోకి వచ్చావు. ఇలా ఎన్నోసార్లు ఈ సెట్‌లోకి అడుగుపెట్టావు’’ అని కరణ్‌ చెప్పుకొచ్చారు. అయితే, కరణ్‌ మాజీ భర్త అని సంబోధించగానే.. కరీనా ఒక్కసారి షాకయ్యారు. ఇక, ఇదే షోలోని మరో సెగ్మెంట్‌లో ‘‘రణ్‌బీర్‌, షాహిద్‌ కపూర్‌.. వీరిద్దరిలో ఎవరు వారి పార్టీకి మిమ్మల్ని ఆహ్వానించరు’’ అని కరణ్‌ ప్రశ్నించగా.. ‘‘రణ్‌బీర్‌ నన్ను ఎందుకు పిలవకుండా ఉంటాడు. నాకు తెలిసినంత వరకూ షాహిద్‌ నన్ను ఆహ్వానించకపోవచ్చు’’ అని కరీనా జవాబిచ్చారు. ఆమె ఇచ్చిన సమాధానం విని కరణ్‌ నవ్వుకున్నారు. ‘జబ్‌ వి మెట్‌’ సమయంలో తన తోటి నటుడు షాహిద్‌తో కరీనా ప్రేమలో పడ్డారు. ఆ సినిమా తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. అదే సమయంలో వచ్చిన ‘తషాన్‌’ కరీనా జీవితాన్నే మార్చేసింది. ‘తషాన్‌’లో హీరోగా వర్క్‌ చేసిన సైఫ్‌పై కరీనా ఇష్టం పెంచుకున్నారు. ఆ తర్వాతనే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని