Kiara Advani: ‘సత్యప్రేమ్‌..’ జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలం

ఉత్తరాదిలో అలరిస్తూనే దక్షిణాదిలో స్టార్‌ హీరోల చిత్రాల్లో ఆడిపాడుతున్న కథానాయిక కియారా అడ్వాణీ. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ‘గేమ్‌ ఛేంజర్‌’లో, హిందీలో కార్తిక్‌ ఆర్యన్‌తో ‘సత్యప్రేమ్‌ కీ కథ’ చిత్రాల్లో నటిస్తోంది.

Updated : 11 May 2023 14:11 IST

త్తరాదిలో అలరిస్తూనే దక్షిణాదిలో స్టార్‌ హీరోల చిత్రాల్లో ఆడిపాడుతున్న కథానాయిక కియారా అడ్వాణీ (Kiara Advani). ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ‘గేమ్‌ ఛేంజర్‌’లో, హిందీలో కార్తిక్‌ ఆర్యన్‌తో ‘సత్యప్రేమ్‌ కీ కథ’ (Satyaprem Ki Katha) చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది కార్తిక్‌, కియారా కలయికలో వచ్చిన ‘భూల్‌ భులయ్యా 2’ మంచి విజయం సాధించడంతో ఈ కొత్త చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో కియారా తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను ఇటీవలే పూర్తి చేసింది. ఈ సినిమా గురించి కియారా మాట్లాడుతూ ‘‘నా మనసుకి ఎంతో దగ్గరైన సినిమా ఇది. ఈ సినిమా ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఈ సినిమా నాకు ఎందరో కొత్త స్నేహితుల్ని ఇచ్చింది. వాళ్లంతా నాకు ఎంతో విలువైన వాళ్లు. వారి జ్ఞాపకాలు ఎప్పటికీ మనసులో పదిలంగా ఉంటాయి’’అని రాసింది. జాతీయ అవార్డు గ్రహీత సమీర్‌ విద్వాన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మిస్తున్నారు. జూన్‌ 29న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని