Mahesh Babu: నాన్నకు రుణపడి ఉంటా

‘‘నాన్న నాకు చాలా ఇచ్చారు. ఆయన నాకు ఇచ్చినవాటిలో అన్నిటికంటే గొప్పది మీ అభిమానమే. ఆ విషయంలో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు మహేష్‌బాబు.

Updated : 28 Nov 2022 06:56 IST

‘‘నాన్న నాకు చాలా ఇచ్చారు. ఆయన నాకు ఇచ్చినవాటిలో అన్నిటికంటే గొప్పది మీ అభిమానమే. ఆ విషయంలో ఆయనకి ఎప్పటికీ రుణపడి ఉంటా’’ అంటూ అభిమానుల్ని ఉద్దేశించి భావోద్వేగంతో మాట్లాడారు మహేష్‌బాబు (MaheshBabu). అభిమానులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆదివారం హైదరాబాద్‌లో సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్దకర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘నాన్న ఎప్పుడూ మన మధ్య, మన హృదయాల్లో ఉంటార’’న్నారు. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ‘‘యాభయ్యేళ్ల కిందట ‘మాయదారి మల్లిగాడు’ సినిమాలోని నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ... అనే పాటలాగే అన్నయ్య జీవితం సాగింది. అనేక విజయాలు సొంతం చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ మనందరి మధ్యే ఉంటార’’న్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని