Published : 14/01/2022 20:55 IST

Bhogi: భోగి పండగ.. సినిమా సర్‌ప్రైజ్‌లు నిండుగా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినిమా అంటేనే చాలా మందికి పండగ. మరి అలాంటిది పండగ వేళ సినిమా కబుర్లు లేకపోతే ఏం బాగుంటుంది? అందుకే.. త్వరలో విడుదలకానున్న సినిమాల సర్‌ప్రైజ్‌లు భోగి పండగ సందర్భంగా సందడి చేస్తున్నాయి. అవేంటో చూసేద్దామా..

ఆర్‌ఆర్‌ఆర్‌ పోస్టర్‌

రామ్‌చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఇద్దరి పాత్రలకు సంబంధించిన పోస్ట్‌ర్‌ విడుదలైంది. ఇప్పటికే విడుదలకావాల్సిన ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

హీరో ఫుల్‌ వీడియో..

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ తనయుడు, మహేశ్‌బాబు మేనల్లుడు అశోక్‌, నిధి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘హీరో’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలోని ‘బుర్ర పాడవుతదే’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

మీనాచ్చి.. రాకాచి

శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి తెరకెక్కిస్తున్న చిత్రం ‘భళా తందనాన’. కేథరిన్‌ కథానాయిక. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని ‘మీనాచ్చి.. రాకాచి’ అనే సాంగ్‌ ప్రోమో విడుదలైంది. ‘ఈటీ’ చిత్రంలోని సూర్య లుక్‌ ఆకట్టుకునేలా ఉంది. ‘కిన్నెరసాని’ చిత్రం నుంచి ఓ లుక్‌ విడుదలైంది.




Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని