Liger: ‘లైగర్‌’ వేట ఎప్పుడంటే?

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’. ధర్మ ప్రొడక్షన్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.

Updated : 05 May 2022 08:55 IST

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కలయికలో రూపొందిన పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్‌’. ధర్మ ప్రొడక్షన్‌, పూరి కనెక్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 9న విజయ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ప్రచార చిత్రం విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి బుధవారం సామాజిక   మాధ్యమాల ద్వారా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘ఈనెల 9న సాయంత్రం 4గంటలకు ‘లైగర్‌’ వేట ఆరంభం కానుంది’’ అంటూ ట్విటర్‌లో ఓ పోస్టర్‌ పంచుకున్నారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. దీనికి కూర్పు: జునైద్‌ సిద్దిఖీ, స్టంట్స్‌: కెచ్చా, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని