leo ‘లియో’ పార్ట్‌ 2 ఉంటుంది.. ఆయన అంగీకరిస్తేనే: లోకేష్‌ కనగరాజ్‌

విజయ్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రం లియో. దీని సీక్వెల్‌పై  దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.

Published : 18 Feb 2024 15:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్: కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌(vijay) నటించిన సినిమా ‘లియో’(Leo). లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఈ సినిమాకి సీక్వెల్‌ రానుందా అని అడిగిన ప్రశ్నకు లోకేష్‌ సమాధానం చెప్పారు. ‘‘ లియో పార్ట్‌2  కచ్చితంగా ఉంటుంది.  ప్రస్తుతం విజయ్‌ ఆశయం సినిమాలకు భిన్నంగా ఉంది. అందుకు అభినందిస్తున్నా.  విజయ్‌ అంగీకరిస్తే లియో 2 వస్తుంది. కానీ దానికి సమయం అనుకూలించాలి.  ఆయన ఎప్పుడు నాకు ఫోన్‌ చేస్తే అప్పుడు సినిమా మొదలవుతుంది. అనాగే లియో సెకండాఫ్‌ పై వచ్చిన విమర్శలను విన్నాను. ఇకపై చేసే సినిమాల్లో ఆ తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాను’’అని లోకేష్‌ అన్నారు.  

విజయ్‌ వెంకట్‌ దర్శకత్వంలో  రూపొందుతున్న‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ చిత్రంలో నటిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌లో రానున్న ఈ సినిమాలో విజయ్‌ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ క్రమంలో ఆయన ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ ప్రకటించి రాజకీయ ప్రవేశం చేశారు. లోకేష్ కనగరాజ్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తలైవర్‌171 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని