Ramcharan: రామ్‌చరణ్‌- శంకర్‌ మూవీ: చెర్రీ తన శత్రువును ఎంచుకున్నాడా?

రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో ప్రతినాయకుడిగా సురేశ్‌గోపి నటించనున్నట్లు టాలీవుడ్‌ టాక్‌.

Published : 27 Oct 2021 01:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే, నీ క్యారెక్టర్‌ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే, నీ కెపాసిటీ తెలుస్తుంది’ అంటాడు ‘ధ్రువ’ సినిమాలో రామ్‌చరణ్‌. ఇప్పుడు చరణ్‌ చేస్తున్న కొత్త చిత్రంలో తన శత్రువు ఎవరో ఎంచుకోవాల్సి ఉంది. అయితే, ఆ ఎంపిక దర్శకుడు శంకర్‌ చేతిలో ఉంది. అర్థం కాలేదా? అసలు కథేంటో చదివేయండి!

భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో యువ కథానాయకుడు రామ్‌చరణ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే పట్టాలెక్కిన ‘ఆర్‌సీ15’ చిత్రీకరణ పుణెలో జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే శ్రీకాంత్‌, సునీల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీకాంత్‌ ప్రతినాయకుడిగా కనిపిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో స్టార్‌ హీరోను ఈ సినిమా కోసం ప్రతినాయకుడిగా తీసుకున్నట్లు సమాచారం. మలయాళ స్టార్‌ సురేశ్‌ గోపి ఇందులో మరో విలన్‌గా నటించనున్నట్లు సమాచారం. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు, సురేశ్‌ గోపి భార్యగా ఇషాగుప్తా నటించనున్నారని, ఆమెది కూడా నెగెటివ్‌ రోల్‌ అని తెలుస్తోంది. అన్నట్లు శంకర్‌ తెరకెక్కించిన ‘ఐ’లో సురేశ్‌గోపి నెగెటివ్‌ రోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు, శిరీష్‌ నిర్మిస్తున్న 50వ చిత్రమిది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. రామ్‌చరణ్‌కి జోడీగా కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌చంద్ర, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, ఛాయాగ్రహణం: తిరుణ్ణావుక్కరసు, ప్రొడక్షన్‌ డిజైనర్స్‌: రామకృష్ణ - మోనిక, రచన: సాయిమాధవ్‌ బుర్రా, సు.వెంకటేశన్‌ - వివేక్‌ (తమిళం), పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంతశ్రీరామ్‌, వివేక్‌ (తమిళం).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు