‘మన సంక్రాంతి’వీడియో సాంగ్‌ చూశారా! 

సంక్రాంతి వస్తుందంటే చాలు పల్లెటూళ్లన్నీ కొత్త శోభను సంతరించుకుంటాయి. పల్లెటూరి అందాలను చూపిస్తూ సంక్రాతిపై ఎన్నో పాటలు ఇప్పడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజగా నటులు భానుచందర్‌, సుహాసిని జంటగా సంక్రాంతిపై ఒక

Updated : 12 Jan 2021 15:07 IST

హైదరాబాద్‌: సంక్రాంతి వస్తుందంటే చాలు పల్లెలు కొత్త శోభను సంతరించుకుంటాయి. పల్లెటూరి అందాలను చూపిస్తూ సంక్రాతిపై ఎన్నో పాటలు ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. తాజగా నటులు భానుచందర్‌, సుహాసిని జంటగా సంక్రాంతిపై ఒక వీడియోసాంగ్‌ను విడుదల చేశారు. ‘మన సంక్రాంతి’అనే పేరుతో యూట్యూబ్‌లో వస్తోన్న ఈ పాటను భోలే షావలి అనే సంగీత దర్శకుడు రూపకల్పన చేశారు. సినీ గేయ రచయిత కాసర్ల శ్యామ్‌ సాహిత్యం అందించారు. పల్లెటూరి అందాలను, రైతుల ఆనందాన్ని చూపిస్తూ అద్యంతం ఆహ్లాదంగా పాటను తీర్చిదిద్దారు. ఈ సాంగ్‌ను గ్రీన్‌ మెట్రో ఇన్‌ఫ్రాటెక్‌ అధినేత బొడ్డు అశోక్‌ నిర్మించారు. మరి ఆ ఆహ్లదకరమైన ‘మన సంక్రాంతి’ వీడియో సాంగ్‌ను మీరు చూసేయండి!

ఇవీ చదవండి!

‘అశ్వథ్థామ’గా రాబోతున్న విక్కీ కౌశల్‌ 

ఎఫ్‌3: ఇక వరుణ్‌ వంతు


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని