Mohan babu: చిత్ర పరిశ్రమకు మోహన్‌బాబు బహిరంగ లేఖ
ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నటుడు మోహన్‌బాబు(Mohan babu) స్పందించారు.
హైదరాబాద్: ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నటుడు మోహన్‌బాబు(Mohan babu) స్పందించారు. చిత్ర పరిశ్రమలోనూ వారందరూ ఒక్కటిగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలని పిలుపునిచ్చారు. సినిమా పరిశ్రమ అంటే నలుగురు హీరోలు.. నలుగురు ప్రొడ్యూసర్లు కాదని హితవు పలికారు. ఈ మేరకు సుదీర్ఘ లేఖ(Mohan babu letter)ను తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘‘మనకెందుకు మనకెందుకు అని మౌనంగా ఉండాలా.. నా మౌనం చేతకానితనం కాదు.. చేవలేనితనం కాదు.. కొంతమంది శ్రేయోభిలాషులు వద్దని వారించారు. ‘నీ మాటలు నిక్కచ్చిగా ఉంటాయి.. కఠినంగా ఉంటాయి.. కానీ, నిజాలే ఉంటాయి. ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు? ఇది నీకు అవసరమా’ అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్టు బతకాలా? నాకు నచ్చినట్టు బతకాలా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానమే ఇది’’
‘‘సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, నలుగురు డిస్టిబ్యూటర్స్ కాదు.. కొన్ని వేలమంది ఆశలు, కొన్ని వేల కుటుంబాలు... కొన్ని వేల జీవితాలు. 47 సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట. అందరి జీవితాలతో ముడిపడిన ఈ సినిమా ఇండస్ట్రీ గురించి మనకు ఉన్న సమస్యల గురించి ముఖ్యమంత్రులకు వివరించాలనుకుంటే అందరూ కలిసి ఒకచోట సమావేశమవ్వాలి. సమస్యలు ఏంటి, పరిష్కారాలు ఏంటి.. ఏది చేస్తే సినీ పరిశ్రమకి మనుగడ ఉంటుందనేది చర్చించుకోవాలి. ఆ తర్వాత మాత్రమే సినిమాటోగ్రఫీ మంత్రుల్ని, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసిగట్టుగా కలవాలి. అలా కాకుండా నలుగుర్నే రమ్మన్నారు. ప్రొడ్యూసర్స్ నుంచి నలుగురు, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఓ ముగ్గురు, హీరోల నుంచి ఇద్దరు, ఏంటిది? మళ్లీమళ్లీ చెబుతున్నా, సినిమా పరిశ్రమలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదు.. అందరూ సమానం.. ఏ ఒక్కరి గుత్తాధిపత్యం కాదు. చిన్న నిర్మాతల్ని కూడా కలుపుకుని ముఖ్యమంత్రుల దగ్గరకి వెళ్ళి సమస్యల్ని వివరిస్తే మనకీ రోజు ఇన్ని కష్టాలు వచ్చుండేవి కావు’’
‘‘సినీ పరిశ్రమలో ఒక పార్టీ వాళ్ళు ఉండొచ్చు, లేదా వేరు వేరు పార్టీల వాళ్ళు ఉండొచ్చు అది వాళ్ళ ఇష్టం, కాదనను. కానీ, ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రుల్ని ముందుగా మనం కలవాలి. వాళ్ళని మనం గౌరవించుకోవాలి. మన కష్టసుఖాలు చెప్పుకోవాలి! అలా జరిగిందా? జరగలేదు. నేను(Mohan babu) ‘మా’ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖలందర్ని కలుపుకొని ఒక్కటిగా వెళ్ళి అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డిగారిని కలిసి ‘పైరసీ కోరల్లో సినిమా నలిగిపోతుంది, మా మీద దయచూపి భిక్ష పెట్టండి’ అనగానే, ఆ మాట చాలా మందికి నచ్చలేదు. కానీ ఆయన్ని కదిలించింది. చాలావరకు పైరసీని కట్టడి చేసింది.. సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడే పనులు చాలావరకు చేసిపెట్టింది అప్పటి ప్రభుత్వం’’
‘‘రూ.300, రూ.350 టికెట్ల రేట్లతో చిన్న సినిమాలు నిలబడ్డం కష్టం. రూ.50, రూ.30లతో టికెట్ల రేట్లతో పెద్ద సినిమాలకు నష్టం. చిన్న సినిమాలు ఆడాలి.. పెద్ద సినిమాలు ఆడాలి.. దానికి సరైన ధరలుండాలి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి ‘అయ్యా.. మా సినీ రంగం పరిస్థితి ఇది.. చిన్న సినిమాల్ని పెద్ద సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మనకి న్యాయం చేయమని అడుగుదాం. సినిమా పరిశ్రమలో 24 క్రాఫ్ట్ ఉన్నాయి.. మా అందరికీ దేవుళ్ళు నిర్మాతలు. కానీ, ఈ రోజున ఆ నిర్మాతలు ఏమయ్యారు? అసలు ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమస్యను భుజాల మీద వేసుకోకుండా ఎవరికి వారే యమునాతీరే అన్నట్టు ఎందుకు మౌనం వహిస్తుందో అర్ధం కావట్లేదు. మీరు ముందుకు రావాల్సిన అవసరం ఉంది, ఒక్కటిగా ఉంటేనే సినిమా బ్రతుకుతుంది.. రండి అందరం కలిసి సినిమాని బతికిద్దాం’’ అని సినిమా పరిశ్రమ సమస్యలను పరిష్కరించాలని పిలుపునిస్తూ (Mohan babu) లేఖ విడుదల చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
సామాజిక మాధ్యమాల వేదికగా సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. ఈసందర్భంగా ‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ కొత్త తేదీని ప్రకటించింది. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
ప్రేమ తన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని నటి శోభితా ధూళిపాళ్ల అన్నారు. -
సింపుల్‌గా నటుడి కుమార్తె వివాహం
మలయాళ నటుడు జయరాం కుమార్తె వివాహం గుడిలో సింపుల్‌గా జరిగింది. -
యశ్ ‘టాక్సిక్’పై వైరలవుతోన్న న్యూస్.. ఎన్ని భాగాలంటే!
యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ చిత్రానికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
ఇప్పటితో పోలిస్తే తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో పరిస్థితులు భిన్నంగా ఉండేవని నటి సోనాలి బింద్రే అన్నారు. -
ఫొటోషూట్‌లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
తాను సవాలుగా స్వీకరించి నటించిన పాత్రల గురించి రాశీఖన్నా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అవేంటంటే? -
అభిమాని బర్త్‌డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
తన అభిమానికి జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకాన్ని ఇచ్చారు బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం. -
‘పుష్ప2’ స్టెప్‌పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
‘పుష్ప2’ పాటపై ఆసీస్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు అల్లు అర్జున్ రిప్లై ఇచ్చారు. -
సిద్ధార్థ్‌తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
తన తల్లి కోరిక మేరకు నిశ్చితార్థం విషయాన్ని మీడియాకు వెల్లడించినట్లు అదితిరావు హైదరీ చెప్పారు. -
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
ఎన్టీఆర్‌తో తనకున్న బంధంపై రాజమౌళి కామెంట్ చేశారు. -
స్విమ్మింగ్ పూల్‌లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ నుంచి మరో వీడియో వచ్చేసింది. ప్రేమను ఉద్దేశించి పూరి మాట్లాడారు. -
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
రజనీకాంత్ బయోపిక్ తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అందులో హీరోగా ఎవరు నటిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డు దక్కింది. -
ఎన్టీఆర్‌ను కలిసిన బాలీవుడ్ సీనియర్ నటుడు.. ఇష్టమైన హీరో అంటూ పోస్ట్
ఎన్టీఆర్‌ను బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కలిశారు. ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
యంగ్‌గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
మొదటి సారి కపిల్‌శర్మ కార్యక్రమానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. -
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
శ్రీసింహా హీరోగా నటించిన ‘ఉస్తాద్’, సత్యం రాజేశ్ ‘పొలిమేర 2’ చిత్రాలకు ‘దాదా సాహెబ్ ఫిల్మ్ ఫెస్టివల్’ అవార్డులు దక్కాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్‌లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్