మిహీక పెళ్లి డ్రెస్‌ ధర ₹6 లక్షలట...

పెళ్లిలో తాళి, తలంబ్రాల తంతు తర్వాత అందరూ చూసేది దుస్తుల గురించి. సెలబ్రిటీల పెళ్లిలో అయితే అది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. డిజైనర్‌ వేర్‌తో ధగధగ మెరిసోతుంటారు మరి. రానా-మిహీక పెళ్లిలో

Updated : 23 Feb 2024 19:23 IST

సమంత ‘హల్దీ’ డ్రెస్‌ అయితే ₹1.6 లక్షలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లిలో తాళి, తలంబ్రాల తంతు తర్వాత అందరూ చూసేది దుస్తుల గురించి. సెలబ్రిటీల పెళ్లిలో అయితే అది ఇంకొంచెం ఎక్కువే ఉంటుంది. డిజైనర్‌ వేర్‌తో ధగధగ మెరిసోతుంటారు మరి. రానా-మిహీక పెళ్లిలో కూడా ఇదే జరిగింది. ఓవైపు వధువు మిహీక బంగారు, క్రీమ్‌ రంగు లెహంగాలో మెరిసిపోగా, సమంత.. నీలం రంగు చీరలో అదిరిపోయింది. దుస్తులే కాదు. వాటి ధరలు కూడా అదిరిపోయాయట.

మిహీక డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్ అనామికా ఖన్నా డిజైన్ చేశారు. ఈ డ్రెస్ వెనుక వందల గంటల శ్రమ ఉందట. డ్రెస్‌ మొత్తం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశారట. ఈ ఒక్క డ్రెస్ కోసం మిహీక సుమారు₹6 లక్షలు ఖర్చు చేసినట్టు టాలీవుడ్‌ వర్గాల భోగట్టా. హల్దీ వేడుకలో ఆమె ధరించిన పసుపు రంగు డ్రెస్‌ కూడా ₹2 లక్షల వరకు ఉంటుందటున్నారు. దీనిని అర్పితా మెహతా డిజైన్‌ చేశారట.

ఇక సమంత డ్రెస్‌ విషయానికొస్తే... పెళ్లికి నీలం రంగుపై ఎంబ్రాయిడరీ చేయించిన చీరలో పెళ్లికి వచ్చింది. దీనిని ‘రా మాంగో’ టీమ్‌ డిజైన్‌ చేసింది. దీని ధర లక్షల్లో ఉంటుందంటున్నారు. ఇక హల్దీ వేడుకలో సమంత ధరించి డ్రెస్‌ వేడుకలో ఓ హైలైట్‌ అని టాక్‌. దీనిని అర్పిత మెహతా డిజైన్‌ చేశారు. దీని ధర ₹1.59 లక్షలు అని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని