Naga Chaitanya: లుక్కు కోసం కసరత్తులు

నాగచైతన్య తన 23వ చిత్రం కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు.

Updated : 06 Nov 2023 13:55 IST

నాగచైతన్య తన 23వ చిత్రం కోసం ప్రత్యేకంగా సిద్ధమవుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. మత్స్యకారుల జీవితాలకు అద్దం పట్టే ఓ యథార్థ కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం తన లుక్‌, శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు చైతూ. ఇప్పటికే జుట్టు, గెడ్డం పెంచి మాస్‌ లుక్‌లోకి మారిన ఆయన.. ఇప్పుడు కండలు పెంచడంపై దృష్టి సారించారు. జిమ్‌లో కఠిన కసరత్తులు చేస్తూ బీస్ట్‌ మోడ్‌లోకి మారుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆదివారం సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈనెల 23న చైతన్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ ప్రచార చిత్రం విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. నెలాఖరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు కానుందని సమాచారం. ఇందులో చైతూకు జోడీగా సాయిపల్లవి కనిపించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని