Naga Shaurya: ‘రంగబలి’తో బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం: నాగశౌర్య

‘‘రంగబలి’తో ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వనున్నాం. ఈ చిత్ర ఫలితంపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. దీని నుంచి నేను బ్లాక్‌బస్టర్‌ తప్ప మరేమీ కోరుకోవట్లేద’’న్నారు నాగశౌర్య.

Updated : 03 Jul 2023 13:44 IST

‘‘రంగబలి’(Rangabali)తో ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వనున్నాం. ఈ చిత్ర ఫలితంపై నేను చాలా నమ్మకంగా ఉన్నా. దీని నుంచి నేను బ్లాక్‌బస్టర్‌ తప్ప మరేమీ కోరుకోవట్లేద’’న్నారు నాగశౌర్య (Naga Shaurya). ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని పవన్‌ బాసంశెట్టి తెరకెక్కించారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. యుక్తి తరేజ కథానాయిక. ఈ సినిమా ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో మాట్లాడుతూ.. ‘‘నేను.. సుధాకర్‌ కలిసి సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. పవన్‌ చెప్పిన కథ విన్నాక.. చేస్తే ఇలాంటి కథే చేయాలనిపించింది. చాలా నమ్మకంగా చెబుతున్నా.. దీంతో కచ్చితంగా బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం. ఇప్పటి వరకు సుధాకర్‌కు వచ్చిన లాభాల కంటే ఈ చిత్రానికి వచ్చిన లాభాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకంగా చెబుతున్నా. యుక్తి చక్కగా నటించింది. సత్య మంచి టైమింగ్‌ ఉన్న నటుడు. ఇందులో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉంది. దర్శకుడు పవన్‌ చాలా బాధ్యతగా.. నిజాయతీగా ఈ సినిమా తీశారు. తను పెద్ద దర్శకుడవుతాడు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో శౌర్య హీరోయిజం, ఎమోషన్‌ కొత్తగా చూస్తారు. నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రాన్ని పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు దర్శకుడు పవన్‌. కార్యక్రమంలో యుక్తి, కిషోర్‌ తిరుమల, సుధాకర్‌, శ్రీకాంత్‌ ఓదెల తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని