Nani: నాన్న ప్రయాణం

కథలకి అనుగుణంగా ప్రయాణం చేసే కథానాయకుడు నాని. తనకి విజయాన్ని అందించాయని అవే తరహా కథల్ని కాకుండా... కొత్త వాటిని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు.

Updated : 29 Oct 2023 13:54 IST

సెట్లో సందడి

కథలకి అనుగుణంగా ప్రయాణం చేసే కథానాయకుడు నాని. తనకి విజయాన్ని అందించాయని అవే తరహా కథల్ని కాకుండా... కొత్త వాటిని ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. ఆ ప్రయత్నమే తోటి కథానాయకుల్లో నానిని ప్రత్యేకంగా నిలుపుతోంది ‘హాయ్‌ నాన్న’ అంటూ ఈసారి నాన్న కథలో నటిస్తున్నాడు నాని. ఆ సినిమా సెట్లోని చిత్రమే ఇది. దర్శకుడు శౌర్యువ్‌... కథానాయకుడు నానికి సెట్లో మార్గ నిర్దేశనం చేస్తున్నారు. నాన్న ప్రేమకథలు... నాన్న పెళ్లి కథలతో ఇదివరకు చాలా సినిమాలే వచ్చాయి. విజయాల్ని అందుకున్నాయి. మరి నాని చేస్తున్న ఈ నాన్న కథ ఎలాంటిదో తెలియాలంటే డిసెంబరు 7వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో నాని సరసన మృణాల్‌ ఠాకూర్‌ నటిస్తున్నారు. మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని