Hunt: మిట్ట మిట్ట సూత్తారే..
సుధీర్‌బాబు కథానాయకుడిగా... భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హంట్’. మహేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రధారులు.
సుధీర్‌బాబు (Sudheer Babu) కథానాయకుడిగా... భవ్య క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హంట్’ (Hunt). మహేష్ (Mahesh) దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనందప్రసాద్ నిర్మాత. శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రధారులు. పాపతో పైలం... అంటూ సాగే ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. జిబ్రాన్ స్వరపరిచిన ఈ గీతాన్ని, మంగ్లీ, నకాష్ అజీజ్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ రచించారు. యశ్ నృత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాటలో ‘సీటీగొట్టి సీటీగొట్టి మిట్ట మిట్ట సూత్తారే..’ అంటూ సుధీర్‌బాబు, అప్సరారాణి సందడి చేశారు. ‘‘సినిమాలో రెండు పాటలున్నాయి. ఈ రోజు విడుదలైన తొలి పాటకి మంచి స్పందన లభిస్తోంది. స్టైలిష్‌గా సాగే హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సుధీర్, శ్రీకాంత్, భరత్ పోలీస్ అధికారుల పాత్రల్ని పోషించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు నిర్మాత.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
ECI: 1,500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం
-
Politics News
Raghurama: బాబాయ్‌కి ప్రత్యేకహోదా సాధించిన జగన్: రఘురామ
-
Crime News
America: అమెరికాలో నిజామాబాద్ వాసి సజీవ దహనం