Liger: నాతో రా...పోరాటం చేద్దాం

‘‘నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం’’ అంటూ యువతకు పిలుపిస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. పూరి జగన్నాథ్‌ తెరకెక్కించారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు

Updated : 30 Jul 2022 08:50 IST

‘‘నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం’’ అంటూ యువతకు పిలుపిస్తున్నారు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda). ఆయన కథానాయకుడిగా నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’ (Liger). పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) తెరకెక్కించారు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనన్య పాండే కథానాయిక. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రంలోని ‘‘వాట్‌ లగా’’ (Waat Laga Denge) పాటని విడుదల చేశారు.  ‘‘మేము భారతీయులం. ఎవరికీ తీసిపోం’’ అంటూ పాటలో విజయ్‌ శక్తిమంతమైన సంభాషణలు వినిపించారు. మిక్స్డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ ఆట నేపథ్యంగా సాగే కథతో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు విజయ్‌. ఈ సినిమాకి కూర్పు: జునైద్‌ సిద్ధిఖీ, స్టంట్స్‌: కేచ, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని